Gopi Chand: హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొంది ఆ తర్వాత “యజ్ఞం” చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగించి ప్రేక్షక అభిమానుల పెంచుకున్నారు. అయితే ఇటీవలే విడుదలైన సిటీ మార్ ప్రేక్షకుల ఆదరణ అంతగా పొందలేదని టాక్ వినిపిస్తుంది. తన నెక్స్ట్ సినిమాలతో హిట్ కొట్టాలని మంచి జోష్ మీద ఉన్నారు గోపీచంద్.
విలక్షణ దర్శకుడు మారుతి – గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం “పక్కా కమర్షియల్”. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి కన్నా నటిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్ గా ముందుకు సాగుతున్న జీఏ 2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
అయితే దీపావళి సందర్భంగా ఈ మూవీ నుండి కొత్త అప్డేట్ వచ్చింది.ఈ సినిమా గ్లింప్స్ ను తాజాగా వదిలింది చిత్ర బృందం. గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టీజర్ ను నవంబర్ 8 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ గ్లింప్స్ లో హీరో గోపీచంద్ చాలా గ్లామర్ గా కనిపించారు. ఇప్పటికే టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అభిమానుల నుండి గ్లామరస్ లుక్ లో గోపీచంద్ చూశాక ఈ సినిమా మీద ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని చెప్పాలి.