Eight: కామెడీ స్టార్ గా గుర్తింపు పొందిన సప్తగిరి పరుగు చిత్రంలో నటించిన అంత గుర్తింపు లేదని చెప్పాలి. అయితే మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం తో ప్రేక్షక హృదయాలలో కామెడీ స్టార్ గా తనకంటూ గుర్తింపు పొందారు ఆ తర్వాత వచ్చిన త్రిపుర, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాలతో తన కామెడీతో నవ్వించారు ఈ హాస్య నటుడు కామెడీతో పాటు సప్తగిరి ఎక్స్ప్రెస్,సప్తగిరి ఎల్.ఎల్.బి, వంటి పలు రకాల సినిమాలలో కథానాయకుడు కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
తాజాగా సూర్యాస్ దర్శకత్వంలో సప్తగిరి నటిస్తున్న చిత్రం ‘ఎయిట్’. స్నేహా ఉల్లాల్, సోనీ అగర్వాల్ మరియు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తే దీపావళి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను నటుడు నందమూరి కల్యాణ్‌రామ్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అచ్చు ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.
అయితే కనిపించేది నిజం వినిపించేది అబద్ధం.. భ్రమ’ అంటూ మొదలైన “ఎయిట్ ” టీజర్ ఉత్కంఠగా సాగింది… ఈ కథ ఏంటి సప్తగిరి ఎలా ప్రేక్షక అభిమానుల ను ఎలా ఎంటర్టైన్మెంట్ చేయనున్నారు అనేది త్వరలో తెలియనుంది ఈ సినిమా విడుదలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో ప్రకటించనున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Hero kalyan ram released saptagiris eight movie teaser
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com