కరోనా ప్రభావంతో థియేటర్లు తెరుచుకొని పరిస్థితిలో ప్రేక్షకులకు మునుపటి కన్నా ఎక్కువ వినోదాన్ని అందించిన ఘనత ఓటీటీలకే దక్కుతుంది. ఈ క్రమంలో ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఇప్పుడు సినిమాకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది ఓటీటీ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికల పై వెబ్ సిరీస్ లు, అలాగే వెబ్ ఫిల్మ్స్ అలరిస్తున్నాయి.
ముఖ్యంగా ‘లో బడ్జెట్’ తో సినిమాలు తీసిన నిర్మాతలకు ఓటీటీ రిలీజ్ అనేది పెద్ద ఉపశమనం అయింది. అయితే గత ఏడాది నుండి ఓటీటీలో బాగా హిట్ అయిన సిరీస్ లు, ఫిల్మ్స్ లిస్ట్ ఒకసారి పరిసలిస్తే.. గత ఏడాదిన ఆహాలో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల. ఈ వెబ్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఆల్ట్రా మోడ్రన్ రొమాంటిక్ కామెడీ హిట్ అనిపించుకుంది.
ఇక మరో వెబ్ ఫిల్మ్ ‘భానుమతి అండ్ రామకృష్ణ’. ఆహా వేదికగా వచ్చిన ఈ మెచ్యూర్డ్ లవ్ స్టొరీలో మంచి మ్యాటర్ ఉంది. ముఖ్యంగా పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు సహజంగా ఉంటాయి. ముఫ్ఫై ఏళ్ళు నిండిన భిన్న ధృవాలైన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ ఫిల్మ్ చాల బాగా చూపించింది.
అలాగే మరో సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ లాక్ డౌన్ లో ఓటీటీ సినిమాగా వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఫీల్ గుడ్ సినిమాగా క్రెడిట్ కొట్టేసింది. కామన్ మెన్ రివెంజ్ స్టొరీగా సాగడం కూడా కొత్తగా అనిపించింది. ఆహ్లాదంగా సాగే మరో ఓటీటీ హిట్ ‘కలర్ ఫోటో’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చాలా బావుంది అనిపించుకున్న ఓటీటీ సినిమా ఇది. ఎమోషనల్ కధలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ఇక ఆకాశం నీ హద్దురా ఇప్పటివరకు సౌత్ లో ఓటీటీ వేదికగా విడుదలైన పెద్ద సినిమా అండ్ భారీ విజయాన్ని అందుకున్న సినిమా కూడా ఇదే. అమెజాన్ ప్రైమ్ లో రికార్డ్ వ్యూస్ ను సాధించింది ఈ సినిమా. ఇక మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో వచ్చి బాగా ఆకట్టుకుంది. హీరో ఆనంద్ దేవరకొండకు మొదటి హిట్ ను అందించింది ఈ సినిమా. మధ్య తరగతి కధ కావడంతో సి సెంటర్ జనానికి కూడా బాగా రీచ్ అయింది.
ఇక వెబ్ సిరీస్ లలో కొన్ని సిరీస్ లు చాల బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా 30 వెడ్స్ 21 సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ హిట్ ను అందుకుంది. ఈ సిరీస్ లో నటించిన చైతన్యకి హీరోగా సినిమా వచ్చింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు, ఈ సిరీస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో. అలాగే మరో సిరీస్ ‘సూర్య’. ఈ సిరీస్ కూడా చాలా బాగా హిట్ అయింది.
పంచాయతీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా చాల బాగుంది అని పేరు తెచ్చుకుంది. ఇంజినీరింగ్ చేసిన అబ్బాయి, క్యాంపస్ నియామకాల్లో జాబ్ సంపాదించలేక, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి పరీక్ష రాసి సెలెక్ట్ అవుతాడు, కానీ ఆ ఉద్యోగం ఇష్టం లేని అతను తప్పని పరిస్థితుల్లో జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలే మెయిన్ కథాంశం. ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఎక్కడా విసుగు రాదు. హాస్యభరితంగా సాగుతుంది. ఏదేమైనా ఒటీటీ విప్లవం భవిష్యత్తులో మరింత కీలకం కానుంది.