Upasana About Childrens: ఉపాసన కొణిదెల..ఈమె పేరు తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య గా..చిరంజీవి గారి కోడలి గా..అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా ఉపాసన ప్రతి ఒకరికి సుపరిచితమే..అంతే కాకుండా ఈమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటుంది..సోషల్ మీడియా ద్వారా ఈమె చేసే కామెంట్స్ అప్పుడప్పుడు తెగ వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి..అయితే ఇటీవలే పిల్లల్ని కనడం గురించి ఆమె సోషల్ మీడియా లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సెన్సషనల్ గా మారింది..ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే ఆధ్యాత్మిక గురువు ‘సద్గురు’ నిర్వహించిన ఒక కార్యక్రమానికి అతిధిగా హాజరు అయ్యారు ఉపాసన కొణిదెల..ఈ కార్యక్రమంలో పిల్లల్ని కనడం గురించి ప్రస్తావించగా, దానికి సద్గురు మాట్లాడుతూ ‘రోజు రోజుకి మన దేశ జనాభా పెరిగిపోతూ వెళ్తుంది..అలాంటి సమయం లో నీలాగా ఆరోగ్యం గా ఉండేవారు పిల్లని కనకూడదు అనే నిర్ణయం తీసుకోవడాన్ని నేను మనస్ఫూర్తిగా సమర్దిస్తున్నాను..మీలాంటి వారికి నేను ఒక్క అవార్డుని ప్రకటిస్తాను’ అని సద్గురు మాట్లాడగా వెంటనే మైక్ ఉపాసన మైక్ అందుకొని ‘మీరు ఇచ్చే అవార్డుని మా తాతయ్య గారు అంగీకరించరు’ అంటూ సమాధానము చెప్తుంది ఉపాసన.
Also Read: Lavanya Tripathi Assets: లావణ్య త్రిపాఠి ఆస్తులెన్నో తెలుసా..? ఆమె అపార్ట్మెంట్ అంత అంత ఖరీదా ?
అంటే దీనికి అర్థం త్వరలోనే ఉపాసన తల్లి కాబోతుందంటూ మెగా అభిమానులు మురిసిపోతున్నారు..మెగా వారసుడి కోసం వారంతా ఎంతో కాలం నుండి నిరీక్షిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..రామ్ చరణ్ తో పాటుగా పెళ్ళైన ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ వంటి వారు చెరో ఇద్దరు పిల్లల్ని కని ఎంతో సంతోషవంతమైన జీవితాన్ని గడుపుతుండగా..రామ్ చరణ్ మాత్రం ఇంకా పిల్లల్ని కనకపోవడానికి కారణం ఏమిటి అని అభిమానులు తలలు పెట్టుకునేవారు..అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు..ఉపాసన అపోలో హాస్పిటల్స్ ద్వారా తానూ చెయ్యాలనుకున్న కొన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే పిల్లల్ని కంటాను అని తన తాతయ్య గారికి ప్రమాణం చేసిందట..ఇచ్చిన మాట ప్రకారం పెళ్ళై పదేళ్లు దాటినా కూడా పిల్లల్ని కనకుండా మాటకు కట్టుబడింది..ఇప్పుడు ఆమె అనుకున్న కార్య కలాపాలు అన్ని పూర్తి అవ్వడం తో పిల్లల్ని కనడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది..ఏది ఏమైనా త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడు అనే ఊహనే అభిమానులను చాలా థ్రిల్ కి గురి చేస్తుంది.
Also Read: YS Vijayamma Resigned: విజయమ్మ రాజీనామాతో వైసీపీకి నష్టమేనా?
Recommended Videos