Lavanya Tripathi Assets: లావణ్య త్రిపాఠి వన్నె తగ్గని అందంతో 13 ఏళ్లుగా హీరోయిన్ గానే కొనసాగుతోంది. లావణ్య త్రిపాఠి అందచందాల గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హోమ్లీ బ్యూటీ చూస్తూ ఉండగానే ఇండస్ట్రీకి వచ్చి 13 ఏండ్లు పైగానే దాటింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా లావణ్య త్రిపాఠి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ లావణ్య త్రిపాఠి ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు.
మొత్తమ్మీద లావణ్య త్రిపాఠి స్టార్ హీరోయిన్ కాలేకపోయినప్పటికీ.. తన పర్సనల్ జీవితాన్ని లగ్జరీగా గడిపే విషయంలో మాత్రం రాజీపడదట. లావణ్య త్రిపాఠికి ఇప్పటికే ఖరీదైన కార్లు, ఇల్లు, ఆభరణాలు ఉన్నాయి. లావణ్య త్రిపాఠి విలాసవంతమైన జీవితానికి ఆమె పేరెంట్స్ కూడా కారణం అట. ఇంతకీ లావణ్య త్రిపాఠి ఆస్తుల వివరాలు తెలుసా ?
లావణ్య త్రిపాఠికి ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూహూలో ఒక అపార్ట్మెంట్ ఉంది. దాని ఖరీదు అక్షరాల రూ. 16.60కోట్లు. పైగా అధునాతన ఇంటీరియర్స్‌తో లావణ్య త్రిపాఠి తన ప్లాట్ ను అద్భుతంగా డిజైన్ చేయించుకుంది. లావణ్య త్రిపాఠి మొత్తం ఆస్తి రూ. 120 కోట్ల పైనే ఉంటుందని తెలుస్తోంది. లా వణ్య త్రిపాఠి గ్యారేజీలో పలు ఖరీదైన కార్లు ఉన్నాయి.
లావణ్య త్రిపాఠి కార్ల లిస్ట్ లో ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్’ కూడా ఉంది. దీని ఖరీదు రూ.75.59 లక్షలు, అలాగే లావణ్యకి బీఎండబ్ల్యూ 320ఐ కూడా ఉంది. దీని ఖరీదు రూ. 43.50 లక్షలుగా ఉంది. అదే విధంగా ‘మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ’ ను కూడా లావణ్య త్రిపాఠి ఎంతో ఇష్టపడి కొనుక్కుంది. దీని ఖరీదు రూ. 1.02 కోట్లుగా ఉంది. లావణ్య త్రిపాఠికు ఆభరణాలు అంటే చాలా ఇష్టం అట.
లావణ్య త్రిపాఠికు ఆదాయం సినిమాల ద్వారానే కాకుండా.. యాడ్స్ రూపంలోనూ వస్తుంది. అంతేకాదు ఆమె పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా.. బిజినెస్ రూపంలోనూ ఎక్కువగా సంపాదిస్తోందట. ఇక లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.