Hollywood: హాలీవుడ్ లో వచ్చిన ఈ రెండు హార్రర్ సినిమాలు చూశారా..?

Hollywood: హాలీవుడ్ లో వచ్చిన ఒక రెండు హార్రర్ సినిమాలు మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రేక్షకుడి లోపల ఒక తెలియని భయాన్ని అయితే రేకెత్తిస్తాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం...

Written By: Gopi, Updated On : June 17, 2024 12:42 pm

Have you seen these two horror movies in Hollywood

Follow us on

Hollywood: సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకులకు ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. కొంతమంది కమర్షియల్ యాక్షన్ సినిమాలను ఇష్టపడితే మరి కొంతమంది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే హార్రర్ సినిమాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇక భయపడుతూనే హార్రర్ సినిమాలను చూస్తూ అందులో ఉన్న హార్రర్ ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక తెలుగులో హార్రర్ సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. కానీ హాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే హాలీవుడ్ లో వచ్చిన ఒక రెండు హార్రర్ సినిమాలు మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రేక్షకుడి లోపల ఒక తెలియని భయాన్ని అయితే రేకెత్తిస్తాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

1. వెరోనికా
వెరోనికా అనే సినిమా స్టోరీ ని రియల్ కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే వెరోనికా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి విజయ్ టోన్ అనే గేమ్ ని ఆడుతుంది. ఇక దాని ద్వారా చనిపోయిన వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ గేమ్ రూల్ ఏంటంటే ఈ గేమ్ ని ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు కూడా గేమ్ చివరి వరకు ఒకరి చేతిని ఒకరు వదిలిపెట్టకూడదు. కానీ వెరునికా ఫ్రెండ్స్ మాత్రం మధ్యలోనే ఆమె చేయని వదిలేస్తారు. ఇక అప్పుడు ఏం జరిగింది తన ఫ్రెండ్స్ ని తను ఎలా కాపాడుకుంది. వాళ్ల నాన్న ఆత్మతో తను మాట్లాడిందా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమాలో అధ్యంతం ఉత్కంఠ గా చూపించారు. ఇక ఆ తరవాత ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది వెళ్లి చూడండి..

Also Read: House Of The Dragon Season 2: అంచనాలను పెంచేస్తున్న ‘హౌజ్ ఆఫ్ ది డ్రాగన్’ సెకండ్ సీజన్…

2. ఇన్ కన్వెంటేషన్
ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు తీవ్రమైన భయాందోళనకు గురవుతుంటారు. ఇక ఈ సినిమాలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అయితే వస్తుంది. ఆ మ్యూజిక్ ని విన్న ప్రతిసారి మన వెనకాల నుంచి ఎవరో వస్తున్నట్టు, మన వెనకాల ఎవరో ఉన్నట్టుగా ఒక తెలియని ఇల్యుజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే ఒక విలేజ్ కి వెళ్ళిన ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న సంస్కృతిని, వింత ఆచారాలను వాళ్ళు చేసే విచిత్రమైన పూజలను చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్లకు అక్కడ ఒక టనల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Avatar 3: అవతార్ 3 కోసం రెడీ అవుతున్న జేమ్స్ కామెరాన్

అయితే ఆ టనల్ లో ఏదో ఒక దివ్యమైన శక్తి ఉందని ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతుంటారు. అయితే ఆ టనల్ లోకి మాత్రం ఈ ముగ్గురు వెళ్లి అందులో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. మరి ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురుకి ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ తిరిగి బయటికి వచ్చారా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ సినిమాలో చాలా డీటెయిల్ గా చూపించారు.