Fat Yogasanas : ఇలా చేసి చూడండి.. ఒంట్లో కొవ్వు దెబ్బకు కరుగుతుంది..

Fat తర్వాత ఒళ్ళును నిదానంగా వంచడం, పైకి లేవడం వంటి క్రియలు చేయండి. శ్వాసను బలంగా తీసుకోవడం, అంతే బలంగా వదిలేయడం వంటివి చేయండి.

Written By: NARESH, Updated On : June 17, 2024 3:01 pm

With these yogasanas, fat in the body melts away

Follow us on

Fat yogasanas : శారీరక వ్యాయామం లోపించినప్పుడు శరీరం లావెక్కుతుంది. పలుభాగాలలో కొవ్వు పేరుకు పోతుంది. అది అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. చాలామంది కొవ్వును కరిగించేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తుంటారు. అయితే జిమ్ కొందరికి సరిపడదు.. అలాంటి వారు యోగా చేస్తే.. రకరకాల ఆసనాలు వేస్తే.. నాజూకైన శరీరం సొంతమవుతుంది.

శవాసనం

శవాసనం

మీ కాళ్లను కొద్దిగా దూరంగా, చేతులు మీ వైపు ఉంచి.. అరచేతులు పైకి ఎదురుగా ఉండేలా పడుకోండి. కళ్ళు మూసుకోండి. విశ్రాంతి తీసుకోండి. శ్వాస పై దృష్టి పెట్టండి. . చాలా సేపు వరకు ఈ ఆసనంలో ఉండండి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ముఖ స్వనాసన

ముఖ స్వనాసన

మీ చేతులను మోకాళ్ల వరకు ఉంచండి. మోకాళ్ళ మధ్య కాస్త అటూ ఇటూ గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత కాళ్లను నిటారుగా ఉంచండి. అప్పుడు అది విలోమ ” వీ” ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత మీ చేతులను నేలపై గట్టిగా అదిమిపట్టండి. రెండు చేతుల మధ్యలో తలను ఉంచండి. తర్వాత శ్వాస తీసుకోవడం, వదిలేయడం వంటివి చేయండి.

భుజంగాసనం

ఉదరం పై కాస్త ఒత్తిడి పెరిగేలా పడుకోండి. భుజాల కింద చేతులు, శరీరానికి దగ్గరగా మోచేతులు వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత మీ చాతి భాగాన్ని కాస్త పైకి లేపండి. మోచేతులను కాస్త వంగి ఉంచండి. కొంచెం పైకి చూసిన తర్వాత.. శ్వాస తీసుకోవడం, వదిలేయడం వంటివి చేయండి.

సేతు బంధనం

సేతు బంధనం

మీ మోకాళ్ళను వంచి, పాదాలను నేలపై ప్లాట్ గా ఉంచండి. తుంటిని కాస్త వెడల్పు చేస్తూ పడుకోండి. మీ చేతులను మీ వైపులా ఉంచుకోండి. అరచేతులను కిందికి ఉంచండి. ఇలా చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం, వదిలేయడం వంటివి చేయండి.

పర్వత భంగిమ

పర్వత భంగిమ

మీ శరీర బరువును రెండు కాళ్లపై సమానంగా ఉంచండి. ఈ సమయంలో ఊపిరి పీల్చుకోండి, ఆ తర్వాత మొదలెయ్యండి. రెండు చేతులను పైకి లేపండి.. వేగంగా చేతి వేళ్లను కదుపుతూ ఉండండి. తర్వాత ఒళ్ళును నిదానంగా వంచడం, పైకి లేవడం వంటి క్రియలు చేయండి. శ్వాసను బలంగా తీసుకోవడం, అంతే బలంగా వదిలేయడం వంటివి చేయండి.