https://oktelugu.com/

Sai Dharam Tej: మామయ్య పవన్ కి సాయి ధరమ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటీ? దాని విలువ ఎంతో తెలుసా?

పవన్ కళ్యాణ్ కి కుటుంబ సభ్యుల నుండి బహుమతులు అందడం విశేషం. చిరంజీవి సతీమణి సురేఖ మరిది పవన్ కళ్యాణ్ కి ఒక బహుమతి ఇచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 17, 2024 / 12:29 PM IST

    Sai Dharam Tej

    Follow us on

    Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ పట్టరాని ఆనందంలో ఉంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. అలాగే ఆయనను మంత్రి పదవి వరించింది. డిప్యూటీ సీఎంగా కూడా నియమించారు. అలాగే కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీలుగా జనసేన పార్టీ తరపు నుండి పోటీ చేశారు. వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ అభ్యర్థులు అందరూ గెలిచారు. పవన్ కళ్యాణ్ పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ కి కుటుంబ సభ్యుల నుండి బహుమతులు అందడం విశేషం. చిరంజీవి సతీమణి సురేఖ మరిది పవన్ కళ్యాణ్ కి ఒక బహుమతి ఇచ్చారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. సదరు గిఫ్ట్ చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సాయి ధరమ్ తేజ్ మామయ్య పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే… ‘స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్’.

    ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సాయి ధరమ్ తేజ్ పంచుకున్నారు. ఆయనతో దిగిన ఫోటో షేర్ చేశాడు. అలాగే ఓ ఎమోషనల్ కామెంట్ జోడించాడు. నాకు స్టార్ వార్స్, లెగో ను పరిచయం చేసిన వ్యక్తి, నా ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎంకి బహుమతి ఇచ్చే అవకాశం లభించింది. నా చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని చిన్నపిల్లాడి కోసం ఈ గిఫ్ట్ ఇస్తున్నాను… అని సాయి ధరమ్ తేజ్ రాసుకొచ్చాడు. చిన్న పిల్లలకు ఇచ్చే గిఫ్ట్ ఇచ్చి సాయి ధరమ్ ప్రత్యేకత చాటుకున్నాడు.

    కాగా సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఈ బహుమతి విలువ రూ. 1.2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కాగా గత ఏడాది పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ చిత్రం చేశారు. వినోదయ సిత్తం రీమేక్ బ్రో లో వీరు భాగమయ్యారు. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించగా బ్రో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. కాగా చిన్నప్పటి నుండి తన ఆలనా పాలనా పవన్ కళ్యాణ్ చూసుకున్నారు. నాకు ముంబై లో యాక్టింగ్ నేర్పించారని గతంలో సాయి ధరమ్ తేజ్ వెల్లడించిన విషయం తెలిసిందే..