https://oktelugu.com/

Avatar 3: అవతార్ 3 కోసం రెడీ అవుతున్న జేమ్స్ కామెరాన్

అవతార్ 3 సినిమాని కూడా చేసి మరోసారి ప్రేక్షకుడిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికి అవతార్ సినిమా ఎంతైతే ఇంపాక్ట్ ను చూపించిందో అవతార్ 2 సినిమా అంత మంచి పేరైతే సంపాదించుకోలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 16, 2024 / 09:11 AM IST

    Avatar 3

    Follow us on

    Avatar 3: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్.. ఈయన ఒక సినిమాని సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో విజువల్స్ వండర్ గా తెరకెక్కించడంలో తను ఎప్పుడు ముందు ఉంటాడు. అయితే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ ను సాధించి భారీ వసూళ్లను కూడా రాబడుతూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం వచ్చిన అవతార్ 2 సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఆయనకు మాత్రం ఆ సక్సెస్ అంతగా సంతృప్తిని ఇవ్వలేదట.

    అందువల్లే అవతార్ 3 సినిమాని కూడా చేసి మరోసారి ప్రేక్షకుడిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికి అవతార్ సినిమా ఎంతైతే ఇంపాక్ట్ ను చూపించిందో అవతార్ 2 సినిమా అంత మంచి పేరైతే సంపాదించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మరోసారి అవతార్ 3 తో ప్రపంచవ్యాప్తంగా తను అందర్నీ అలరించాలనే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు.

    నిజానికి అవతార్ 2 సినిమాను కూడా భారీ ఎఫర్ట్ పెట్టి తీసినప్పటికి ఆయనకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదని ఆయన కొంతవరకు నిరుత్సాహ పడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి అది ఎందువల్ల అలా జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన రెక్టిఫై చేసి సినిమా కాన్సెప్ట్ దగ్గర నుంచి దాన్ని తెరకెక్కించే వరకు తను స్పెషల్ కేర్ తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లలో జేమ్స్ కామెరాన్ ఒకరు. ఇక అలాంటి దర్శకుడి నుంచి వచ్చే సినిమా గురించి ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే జేమ్స్ కామెరాన్ అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…