https://oktelugu.com/

House Of The Dragon Season 2: అంచనాలను పెంచేస్తున్న ‘హౌజ్ ఆఫ్ ది డ్రాగన్’ సెకండ్ సీజన్…

మొదటి సీజన్ మంచి విజయాన్ని సాధించడంతో రెండో సీజన్ మీద కూడా చాలా మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 16, 2024 / 05:19 PM IST

    House Of The Dragon Season 2

    Follow us on

    House Of The Dragon Season 2: జూలై 17వ తేదీన జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ యొక్క రెండో సీజన్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలనైతే పెంచేస్తుంది. ఇక ఈ సిరీస్ కు సంబంధించిన చాలా ట్రైలర్స్ ని రిలీజ్ చేశారు. మొదటి సీజన్ మంచి విజయాన్ని సాధించడంతో రెండో సీజన్ మీద కూడా చాలా మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో సోదరులు సోదరులతో పొరాడుతారు. డ్రాగన్స్ కి డ్రాగన్స్ మధ్య జరగబోతున్న యుద్ధం కాబట్టి ఇది ‘యుద్ధ రాయల్’ గా నిర్ణయించారు.

    అయితే ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వడానికి ముందే ఈ సిరీస్ మీద మంచి హైప్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రిన్స్ ఏమండ్ మరియు డేమాన్ టర్గారియన్ తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ నేపథ్యం లోనే మేనల్లుడు మరియు మామ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనబోతున్నట్టుగా మనకు ట్రైలర్ లో అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సిరీస్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించినట్టుగా అర్థమవుతుంది.

    ప్రతి ఎపిసోడ్ కి మధ్యలో ఇంట్రెస్టింగ్ వార్ ఉండేలా డిజైన్ చేసినట్టుగా కూడా ఈ ట్రైలర్ చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది… ఇక ఈ ట్రైలర్ ను బట్టి సిరీస్ ని అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇది గాలి, ఆకలి వాళ్ల ఉనికి కోసం డ్రాగన్స్ మధ్య జరిగే ఒక యుద్ధం గా పరిగణించవచ్చు.ఇక ఇదే విషయాన్ని ఈ సిరీస్ లో చాలా బలంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక మేకర్స్ ఈ సిరీస్ తో ఒక భారీ సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే దీనిని చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి జూలై 17వ తేదీన స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి…