Mufasa The Lion King : 1994లో వచ్చిన ది లయన్ కింగ్ చిత్రాన్ని 2019లో రీమేక్ చేశారు. ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఇక అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ యానిమేటెడ్ మూవీ లయన్ కింగ్. ఈ చిత్రానికి సీక్వెల్ గా ముఫాసా: ది లయన్ కింగ్ తెరకెక్కింది. డిసెంబర్ 20న లయన్ కింగ్ విడుదల చేశారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కుతుంది. తెలుగులో ముఫాసా చిత్రానికి అత్యంత ప్రాచుర్యం లభించింది. అందుకు కారణం… మహేష్ బాబు ప్రధాన పాత్ర ముఫాసా కు డబ్బింగ్ చెప్పారు.
ఈ క్రమంలో ముఫాసా చిత్రాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఫాసా థియేటర్స్ ఎదుట తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు కట్ అవుట్స్ దర్శనం ఇవ్వడం విశేషం. ఇక మొదటి నుండి మహేష్ వైఫ్ నమ్రత ముఫాసా చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. చివరికి సితార సైతం ఒక ప్రమోషనల్ వీడియో చేసింది.
కాగా ముఫాసా మూవీలో పుంబా, తిమోన్ పాత్రలు చాలా కీలకం. హీరో పక్కన ఉండే కమెడియన్స్ లాంటి పాత్రలు అవి. ఈ రెండు పాత్రలకు టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పుంబా పాత్రకు బ్రహ్మానందం, తిమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఒక హాలీవుడ్ సినిమాలోని పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం అదృష్టం అంటున్నారు వీరు. అలాగే పుంబా, తిమోన్ పాత్రకు ఎలా డబ్బింగ్ చెప్పారో తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు.
అలాగే సత్యదేవ్, అయ్యప్ప శర్మ, శుభలేఖ సుధాకర్ సైతం ఈ చిత్రానికి డబ్బింగ్ ఆరిస్టులు గా పని చేశారు. దాదాపు $ 200 మిలియన్ ఖర్చుతో ది లయన్ కింగ్ నిర్మించారు. బార్రి జెన్కిన్స్ దర్శకుడు. జెఫ్ నాథన్సన్ స్క్రీన్ ప్లే అందించారు. మహేష్ చెప్పిన ముఫాసా పాత్రకు ఒరిజినల్ గా హాలీవుడ్ నటుడు ఆరోన్ ప్రిన్స్ పెర్రే డబ్బింగ్ చెప్పారు.