Tollywood Heroines : ఒక హీరోయిన్ కి కేవలం అందం ఉంటే సరిపోదు. ఆ అందం ఉన్నంత కాలమే వాళ్లకు అవకాశాలు వస్తుంది. ఒక్కసారి వయస్సు పెరిగి అందం తరిగిపోయిన తర్వాత ఆ హీరోయిన్ కెరీర్ అయిపోయినట్టే. కాబట్టి అందం తో పాటు కచ్చితంగా టాలెంట్ ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్స్ కి అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ, సరైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేసుకునే అలవాటు లేకపోవడం వల్ల, ఎంత తొందరగా అయితే స్టార్స్ అయ్యారో, అంతే తొందరగా క్రిందకి పడిపోయారు. అలాంటి హీరోయిన్స్ ఈ ఏడాదితో పూర్తిగా కనుమరుగు అయిపోయే పరిస్థితికి వచ్చేసారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.
కృతి శెట్టి :
ఉప్పెన చిత్రంతో సునామి లాగా దూసుకొచ్చిన ఈ హాట్ బ్యూటీ, ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందుకుంది. కానీ ఆ తర్వాత ఈమె ఎంచుకున్న స్క్రిప్ట్స్ సరిగా లేకపోవడంతో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఈ ఏడాది ఈమె శర్వానంద్ హీరో గా నటించిన ‘మనమే’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఈమె కెరీర్ కి తెలుగు లో దాదాపుగా ఎండ్ కార్డు పడినట్టే. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.
శ్రీలీల :
పెళ్ళిసందడి అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ ,ధమాకా చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు మొత్తం ఈమె కాల్ షీట్స్ కోసం క్యూలు కట్టారు. రోజుకి ఈమె మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేది. కానీ చేతికి అందిన ప్రతీ సినిమా చేయడం, స్క్రిప్ట్స్ ని సరిగా ఎంచుకోకపోవడం వల్ల ఈమెకు ‘ధమాకా’ తర్వాత ‘భగవంత్ కేసరి’ తప్ప మరో సినిమా హిట్ సినిమా లేదు. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఈమె చేసిన ‘గుంటూరు కారం’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది లో ఈమె నుండి ఒక్క చిత్రం కూడా విడుదల అవ్వలేదు. రీసెంట్ గా పుష్ప 2 చిత్రంలో ‘కిస్సిక్’ సాంగ్ ద్వారా కాస్త హైలైట్ అయ్యింది.
పూజ హెగ్డే :
గత ఏడాది వరకు టాలీవుడ్ కి ఈమెనే నెంబర్ 1. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, సూపర్ హిట్స్ ని అందుకుంటూ సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ అకస్మాత్తుగా ఈమెకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల ఈమెని మన టాలీవుడ్ హీరోలు పూర్తిగా పక్కన పెట్టేసారు. ఎంతలా అంటే ‘గుంటూరు కారం’ చిత్రంలో శ్రీలీల పాత్ర ని ముందుగా పూజా హెగ్డే చేసింది. కానీ ఆ తర్వాత ఆమెని ఈ సినిమా నుండి తప్పించి శ్రీలీల తో ఆమె క్యారక్టర్ ని రీప్లేస్ చేసారు. ఇప్పుడు ఈమె చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. కానీ తమిళం లో ఈమెకి విజయ్ చివరి చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాతో పాటుగా కాంచన 4 లో కూడా నటించనుంది.
దూసుకుపోతున్న భాగ్యశ్రీ భోర్సే, మీనాక్షి చౌదరి :
ఈ ఏడాది బాగా హైలైట్ అయినా హీరోయిన్స్ వీళ్లిద్దరి. భాగ్యశ్రీ నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ, దర్శక నిర్మాతల కన్ను ఈమె మీద పడింది. ఇప్పుడు వరుసగా చేతినిండా ఆఫర్స్ తో దూసుకుపోతుంది. మరో పక్క మీనాక్షి చౌదరీ కి ఈ ఏడాది లక్కీ భాస్కర్ చిత్రం తర్వాత మరో హిట్ పడలేదు. అయినప్పటికీ కూడా ఆమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక మధ్యలో తళుక్కుమని మెరిసిన నబ్బా నటేష్, కేతిక శర్మ వంటి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు.