Viral Photo : ఈ హీరోయిన్ కెరీర్ ప్లాప్స్ తో మొదలైంది. డెబ్యూ మూవీలో హీరోయిన్ కి చెల్లిగా చిన్న పాత్ర చేసింది. ఒక స్టార్ డైరెక్టర్ తెలుగులో పరిచయం చేశాడు. ఫస్ట్ మూవీ డిజాస్టర్. రెండో మూవీతో ఓ మోస్తరు విజయం అందుకుంది. ఆ చిత్రం తర్వాత వరుసగా ప్లాప్స్ పడ్డాయి. ఒక ఏడాది ఆమె నటించిన చిత్రాలన్నీ విఫలం చెందాయి. కెరీర్ ప్రమాదంలో పడింది అనగా… బంపర్ ఛాన్స్ ఆమె తలుపు తట్టింది. ఒక స్టార్ డైరెక్టర్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. ఆ మూవీ సదరు హీరోయిన్ ఫేట్ మార్చేసింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. 2004లో విడుదలైన క్యూన్ హో గయా నా అనే బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించారు. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేశాడు. ఈ మూవీలో ఐశ్వర్య రాయ్ కి చెల్లిగా కాజల్ నటించింది. తర్వాత ఓ మూడేళ్లు ఆమె కనిపించలేదు. దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం మూవీలో నేరుగా హీరోయిన్ ఆఫర్ పట్టేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్.
దర్శకుడు కృష్ణవంశీ చందమామ మూవీలో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా చందమామ తెరకెక్కింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత కాజల్ వరుస ప్లాప్స్ పడ్డాయి. దుకాణం సర్దనుందని టాక్ వచ్చింది. అప్పుడు రాజమౌళి మగధీర ఆఫర్ ఇచ్చాడు. చిరంజీవి కాజల్ వద్దని అన్నారట. పట్టుబట్టి లుక్ టెస్ట్ చేయించి, చిరంజీవిని ఒప్పించి కాజల్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకొన్నాడట రాజమౌళి.
రామ్ చరణ్ రెండో చిత్రం మగధీర రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో ఫస్ట్ 100 కోట్ల మూవీ మగధీరనే. ఆ మూవీతో గట్టి పునాది వేసుకున్న కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2023లో కూడా బాలకృష్ణ వంటి టాప్ స్టార్ మూవీలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. కాజల్ 2020లో వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు. రెండోసారి కూడా గర్భం దాల్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాజల్ కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. వెబ్ సిరీస్లు సైతం ఆమె చేస్తున్నారు.