Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ కథలతోనే సూర్య ఇన్ని సినిమాలు చేశాడా..?

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టిన మహేష్ బాబు ఈ సినిమా అయిపోయేంత వరకు మరొక సినిమాకు కమిటయ్యే అవకాశాలైతే లేవు.

Written By: Gopi, Updated On : April 5, 2024 5:50 pm

Suriya made so many films with these stories rejected by Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు గా ఎదగడమే కాకుండా తన తండ్రి సంపాదించుకున్న బిరుదును కూడా తనే సంపాదించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సూపర్ స్టార్ ‘ గా వెలుగొందుతున్న మహేష్ బాబు తనకు ఎవరు పోటీ లేరు, పోటీ రారు అనేంతలా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టిన మహేష్ బాబు ఈ సినిమా అయిపోయేంత వరకు మరొక సినిమాకు కమిటయ్యే అవకాశాలైతే లేవు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సంవత్సర సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన కూడా రాజమౌళి సినిమాతో ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోని పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక దానికి సంబంధించిన కసరత్తులనే చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు దగ్గరికి వచ్చిన చాలా సినిమాలని ఆయన రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన వదిలేసిన సినిమాల్లో కొన్ని సినిమాలను తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య చేశాడనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

సూర్య హీరోగా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఘటికుడు ‘ సినిమా స్టోరీని మొదట మహేష్ బాబుకి వినిపించారు. అయితే రవికుమార్ ఈ సినిమాను మహేష్ బాబుతో బైలింగ్వల్ గా చేయాలనే ప్లాన్ చేశాడు. కానీ మహేష్ బాబుకి ఆ స్టోరీ నచ్చకపోవడంతో మహేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ సినిమాని సూర్య చేసి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు…

విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో సూర్య హీరోగా వచ్చిన ’24 ‘ సినిమా కథని కూడా మొదటగా మహేష్ బాబుకి చెప్పారట. కానీ ఆ సినిమాను తను రిజెక్ట్ చేశాడు. దాంతో సూర్య ఈ సినిమా చేసి తెలుగు, తమిళం లో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు…

ఇక మురుగ దాస్ దర్శకత్వంలో సూర్య హీరో గా వచ్చిన ‘సెవెంత్ సెన్స్’ సినిమా కథని కూడా ముందుగా మహేష్ బాబుకి వినిపించారట. ఆ స్టోరీ మహేష్ కి బాగా నచ్చినప్పటికి ఆ స్టోరీ లో ఉన్న మూడు వేరియేషన్స్ లో మహేష్ బాబు తనని తాను ఊహించుకోలేక పోయాడట. దానివల్ల ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు. దాంతో ఆ సినిమాను సూర్య చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…