https://oktelugu.com/

Tollywood: ఓకే కథ తో వచ్చిన ఈ సినిమాల్లో ఎన్ని సక్సెస్ అయ్యయంటే..?

ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే సేమ్ అలాంటి కథలతోనే చాలా సినిమాలు వస్తు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు సేమ్ స్టోరీ తో వచ్చిన సినిమాలు ఏంటి, వాటిలో ఎన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి.

Written By:
  • Gopi
  • , Updated On : April 5, 2024 / 05:45 PM IST

    these movies that came with an okay story were successful

    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాల వల్ల మన స్టార్ హీరోల ఇమేజ్ మొత్తం పాతాళనికి పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే సేమ్ అలాంటి కథలతోనే చాలా సినిమాలు వస్తు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు సేమ్ స్టోరీ తో వచ్చిన సినిమాలు ఏంటి, వాటిలో ఎన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఏ సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ముందుగా రాజ్ తరుణ్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్ గా, త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘సినిమా చూపిస్త మామ’ స్టోరీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుంది. ‘ఒక తండ్రి తన బిడ్డ మీద ఉన్న ఇష్టాన్ని ఆ అమ్మాయి ప్రేమించిన వాడి మీద ఎలా చూపిస్తాడు’ అనే ప్లాట్ తో ఈ సినిమా నడుస్తుంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దీని తర్వాత త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో వచ్చిన ‘ నేను లోకల్ ‘ సినిమా స్టోరీ కూడా ఇదే కావడం విశేషం…ఇక ఇందులో నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు గా నటించారు. ఇక సినిమా చూపిస్త మామ, నేను లోకల్ ప్లాట్ పాయింట్ గాని, స్టోరీ గాని మొత్తం ఒకే వే లో నడుస్తూ ఉంటాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడం విశేషం…

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా స్టోరీ ని కనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ‘హీరో ఫ్యామిలీ అమెరికాలో సెటిలై ఉంటారు. హీరో వాళ్ల మేనత్త వాళ్ళ తాత కి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తనని ఇంట్లో నుంచి వెళ్లగొడుతాడు. ఇక పాతిక సంవత్సరాల తర్వాత వాళ్ల తాతయ్య కోరిక మేరకు వాళ్ళ అత్తమ్మ ని తిరిగి వాళ్ల ఫ్యామిలీ లోకి తీసుకురావడం కోసమే హీరో ఇండియాకి బయలుదేరి వస్తాడు.

    అక్కడ తన అత్త పడే ఇబ్బందులను తొలగించి తనను మార్చి తన తాత దగ్గరికి తీసుకెళ్లడమే ఈ సినిమా స్టోరీ’…ఇక ఇదే కథ తో వచ్చిన మరొక సినిమా ఏంటి అంటే ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ కూడా సేమ్ అత్తారింటికి దారేది సినిమా స్టోరీనే పోలి ఉంటుంది. ఇక ఇందులో అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టగా, గోవిందుడు అందరివాడేలే సినిమా యావరేజ్ గా ఆడింది…