పంచ్ డైరెక్టర్ నిర్మాణం మొదలైంది !

దర్శకుడు హరీష్ శంకర్ అంటేనే.. పంచ్ డైలాగ్ లకు పెట్టింది పేరు అనేది ఇండస్ట్రీలో బాగా వినిపించే మాట. తన సినిమాల్లో హీరోల చేతే కాదు, రియల్ లైఫ్ లో తానూ కూడా పంచ్ డైలాగులు అవలీలగా చెబుతుంటాడు హరీష్ శంకర్. ఇక ఈ దర్శకుడు నిర్మాతగానూ మారబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం కరోనా పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కాబట్టి, ఇక నిర్మాతగా తన సినిమాని మొదలుపెట్టనున్నారు. త్వరలోనే తన బ్యానర్ ను ఎనౌన్స్ చేయబోతున్నాడు […]

Written By: admin, Updated On : February 10, 2021 10:59 am
Follow us on


దర్శకుడు హరీష్ శంకర్ అంటేనే.. పంచ్ డైలాగ్ లకు పెట్టింది పేరు అనేది ఇండస్ట్రీలో బాగా వినిపించే మాట. తన సినిమాల్లో హీరోల చేతే కాదు, రియల్ లైఫ్ లో తానూ కూడా పంచ్ డైలాగులు అవలీలగా చెబుతుంటాడు హరీష్ శంకర్. ఇక ఈ దర్శకుడు నిర్మాతగానూ మారబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం కరోనా పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కాబట్టి, ఇక నిర్మాతగా తన సినిమాని మొదలుపెట్టనున్నారు. త్వరలోనే తన బ్యానర్ ను ఎనౌన్స్ చేయబోతున్నాడు హరీష్ శంకర్.

Also Read: క్రేజీ బ్యూటీ నుండి ఇంట్రస్టింగ్ విషయాలు !

కాగా ప్రొడ్యూసర్ మహేష్ కోనేరుతో పాటు మరికొందరితో కలిసి హరీష్ శంకర్ కొత్త బ్యానర్ స్థాపించాలనుకుంటున్నాడు. ఈ బ్యానర్ లో సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లను కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్ కి వినయ్ అనే కుర్రాడు డైరెక్ట్ చేయబోతున్నాడట. అలాగే స్వయంగా హరీష్ శంకర్ రాసిన ఓ క్రైమ్-కామెడీ సినిమా స్క్రిప్ట్ ను రాసాడు. తన నిర్మాణంలో రెండో సినిమాగా ఈ స్క్రిప్ట్ నే చేయబోతున్నాడట.

Also Read: తన బలహీనతల పై శ్రీముఖి స్పందన !

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు హరీష్ శంకర్. ఇక పవర్ స్టార్ ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాలనూ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏమైనా రీఎంట్రీలోనే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్.. హరీష్ శంకర్ సినిమా పైనే పవన్ ఫ్యాన్స్ ఆశ పెట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్