https://oktelugu.com/

‘కార్తీక దీపం’ అత్త గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

ఆమె వాగ్ధాటిలో హుందా త‌నం తొణికిస‌లాడుతూ ఉంటుంది. ఆమె నడకలో రాజ‌సం క‌నిపిస్తూ ఉంటుంది. ఆమె చూపుల్లో కరుకుదనంతో పాటు క‌రుణా ర‌సం కూడా ఒలుకుతూ ఉంటుంది. కానీ.. ఆమె హృద‌యం ప్రేమ‌తో నిండి ఉంటుంది. హెచ్చరిక‌లో పెద్దరికం కనిపిస్తుందీ.. ఆవేశంలోనూ ఆత్మీయ‌త‌ను కుమ్మ‌రిస్తుంది.. మ‌నిషి ఒక్క‌రే. న‌ట‌న మాత్రం న‌వ‌ర‌సాభ‌రితం. ఆమె మ‌రెవ‌రో కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను బుల్లితెర‌కు క‌ట్టిప‌డేస్తున్న‌ ‘కార్తీకదీపం’ సీరియల్ లో దీప అత్త క్యారెక్ట‌ర్లో న‌టిస్తున్న‌సౌందర్య. చాలా మందికి ఆమె ఆన్ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 10, 2021 / 11:11 AM IST
    Follow us on


    ఆమె వాగ్ధాటిలో హుందా త‌నం తొణికిస‌లాడుతూ ఉంటుంది. ఆమె నడకలో రాజ‌సం క‌నిపిస్తూ ఉంటుంది. ఆమె చూపుల్లో కరుకుదనంతో పాటు క‌రుణా ర‌సం కూడా ఒలుకుతూ ఉంటుంది. కానీ.. ఆమె హృద‌యం ప్రేమ‌తో నిండి ఉంటుంది. హెచ్చరిక‌లో పెద్దరికం కనిపిస్తుందీ.. ఆవేశంలోనూ ఆత్మీయ‌త‌ను కుమ్మ‌రిస్తుంది.. మ‌నిషి ఒక్క‌రే. న‌ట‌న మాత్రం న‌వ‌ర‌సాభ‌రితం. ఆమె మ‌రెవ‌రో కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను బుల్లితెర‌కు క‌ట్టిప‌డేస్తున్న‌ ‘కార్తీకదీపం’ సీరియల్ లో దీప అత్త క్యారెక్ట‌ర్లో న‌టిస్తున్న‌సౌందర్య. చాలా మందికి ఆమె ఆన్ స్క్రీన్ మాత్ర‌మే తెలుసు.. మ‌రి, ఆఫ్ స్క్రీన్లో ఆమె ఎవరు? ఎక్క‌డ ఉంటారు? త‌న జీవిత విశేషాలేంటో చూద్దామా?

    Also Read: క్రేజీ బ్యూటీ నుండి ఇంట్రస్టింగ్ విషయాలు !

    తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ చూడని వారు చాలా అరుదుగా ఉంటారంటే అతిశ‌యోక్తి కాదు. అత్యంత ప్రజాదరణ కలిగిన సీరియల్ గా టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది కార్తీక దీపం. సామాన్యుల నుంచి సెలబ్రెటీల కూడా స‌మ‌యం రాత్రి 7.30 గంట‌ల‌యితే చాలు.. టీవీల ముందుకు చేరిపోతున్నారు. అంతగా అభిమానుల‌ను సొంతం చేసుకుంది కార్తీక దీపం. అయితే.. ఇందులోని క్యారెక్టర్స్ వంటలక్క, డాక్టర్ బాబు, విలన్ మౌనిత ఎంత‌గా పేరు సంపాదించారో.. వాళ్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా క్రేజ్ సంపాదించారు అత్త సౌందర్య. క‌న్న‌డ‌కు చెందిన ఈమె ఇప్పుడు తెలుగువారికి ఎంత‌గానో ద‌గ్గ‌ర‌య్యారు.

    సౌందర్య అసలు పేరు అర్చనా అనంత్‌. ఈ న‌టి జ‌న్మించింది బెంగళూరు‌లో. కన్నడ కుటుంబానికి చెందిన అర్చన.. తెలుగు కూడా చక్కగా మాట్లాడుతారు. ఆమె పేరెంట్స్ ఐదారు భాషలు అన‌ర్గ‌ళంగా మాట్లాడగలుగుతారు. ఆమె తల్లి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాగా.. తండ్రి చాలా భాషల్లో యాక్టర్. అందుకే త‌మ ఇంట్లో తెలుగు కూడా మాట్లాడుతామ‌ని చెబుతారు అర్చ‌న‌. గ్రాడ్యుయేషన్ తోపాటు బ్యూటీషియన్ కోర్స్ కూడా పూర్తి చేసిన అర్చ‌న‌‌కు ప్ర‌స్తుతం ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

    త‌న తండ్రి ప‌లు సీరియ‌ల్స్ లో న‌టించ‌డంతో.. అర్చ‌న‌కు కూడా యాక్టింగ్ పై ఇంట్ర‌స్ట్ పెరిగింద‌ట‌. మొద‌ట్లో అవ‌కాశాలు నెమ్మ‌దించిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత ప్రాధాన్యత క‌లిగిన‌ పాత్రలు లభించాయి. ఇప్పుడు.. తెలుగులో చేస్తున్న‌ కార్తీకదీపం ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఈ సీరియ‌ల్ ను కన్నడలో ‘ముద్దలక్ష్మీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా అత్త క్యారెక్టర్ సౌంద‌ర్య‌నే చేస్తుండ‌డం విశేషం.

    Also Read: తన బలహీనతల పై శ్రీముఖి స్పందన !

    ఇక, అర్చన నటిగా తన కెరీర్‌ని ప్రారంభించకముందు బ్యూటీషియన్‌గా పనిచేశారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ అర్చనకు ప్రవేశం ఉంది. అందుకనే సీరియల్స్ లో తన దుస్తులను తానే తానే చేసుకుంటారట. ఇక నటిగా అడుగు పుట్టకముందు అర్చన కాస్త బొద్దుగా కూడా ఉండేవారు. అయితే.. కార్తీక దీపం ప్రారంభమైన తరువాత కొన్ని అనారోగ్య కారణాల వలన ఆమె బరువును తగ్గారు.

    అర్చనాకు అనంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆయ‌న‌ బిజినెస్‌మ్యాన్. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. ప్ర‌స్తుతం సీరియల్స్ లో దూసుకుపోతున్న అర్చ‌న‌.. సినిమాల్లో కూడా న‌టించాల‌నే కోరిక‌ను వ్య‌క్తం చేస్తోంది. ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు ఉన్న తెలుగు సినిమాల్లో కూడా నటించాలని ఉందని చెబుతున్నారు అర్చ‌నా. ఇక, తెలుగు మూవీస్‌లో ఇష్ట‌మైన హీరో ఎవరంటే.. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు అంటే త‌న‌కు చాలా ఇష్టం అని చెబుతున్నారు అర్చ‌నా. భ‌విష్య‌త్ లో ఆమెకు సినిమా ఛాన్సులు కూడా వ‌చ్చి, వెండి తెర‌పైనా త‌నదైన ముద్ర వేయాల‌ని ఆశిద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్