Harish Shankar : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు దర్శకులకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. రాజమౌళి బాహుబలి సినిమా చేసినప్పటి నుంచి ఇండియాలో తెలుగు సినిమా దర్శకుల పేర్లు చెబితే చాలు ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ డేట్స్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలైతే వరుసగా డిజాస్టర్ల ను మూట గట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా దర్శకులు అయితేనే సక్సెస్ ఫుల్ సినిమా తీయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాంటి క్రమంలోనే కమర్షియల్ డైరెక్టర్లు గా సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీగా డిమాండ్ ఏర్పడడంతో ఇతర భాషల హీరోలతో కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఇట్లాంటి సందర్భంలోనే హరీష్ శంకర్ (Harish Shankar) లాంటి దర్శకుడు బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ (Salman Khan) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి హరీష్ శంకర్ సినిమా అంటే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయాయి. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే ఉండేది. కానీ ఇప్పుడు ఆయనను పట్టించుకునే హీరోలు కరువయ్యారు. అందుకే ఆయన బాలీవుడ్ కండల వీరుడితో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నప్పటికి ఆ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ అయితే లేదు.
Also Read : నేను బాక్సింగ్ కి సంబందించిన సినిమా తీస్తే ఆయనే నా హీరో : హరీష్ శంకర్…
కాబట్టి ఆయన సల్మాన్ ఖాన్ తో సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది… కెరియర్ మొదట్లోనే రామ్ చరణ్ తో సినిమాను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న సంపత్ నంది లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. మరి ఆయన కూడా మంచి సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ప్రస్తుతం ఉన్న సందర్భంలో అతనికి స్టార్ హీరోలెవ్వరు డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు… కాబట్టి శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరోతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లుగా మార్చి మరోసారి తన పేరు ప్రఖ్యాతలను ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న క్రమంలో ఇలాంటి కమర్షియల్ దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మంచి సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గర అవ్వాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : మన సినిమాలు చూడరు..వాళ్ళ సినిమాలు అయితే ఎగేసుకొని చూస్తారు : హరీష్ శంకర్