SRH Vs Mi IPL 2025: సొంత మైదానం లోనైనా కనీసం 200 పరుగులు చేస్తారనుకుంటే 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది హైదరాబాద్ జట్టు. అంతేకాదు ఎన్నో ఆశలు పెట్టుకున్న అనికేత్ వర్మ ( 12) నిర్లక్ష్యమైన షార్ట్ ఆడి అవుట్ కావడంతో.. హైదరాబాద్ జట్టు ఒకానొక దశలో 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది..తద్వారా అత్యంత చెత్త రికార్డులను ఈ ఐపీఎల్ సీజన్ లో నమోదు చేసింది. ముంబై జట్టు ముందు చేతులెత్తేయడం ద్వారా ఐపీఎల్లో ముఖ్యంగా పవర్ ప్లే లో అత్యంత తక్కువ పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది.
Also Read: దేశమంతా “పహల్గాం” విషాదం: MI – SRH ఆటగాళ్ల కీలక నిర్ణయం..
చెత్త గణాంకాలు
2002లో రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ తలపడింది. పవర్ ప్లే లో హైదరాబాద్ జట్టు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ లో అత్యంత చెత్త రికార్డుగా ఇది కొనసాగుతోంది.
2021లో పంజాబ్ జట్టుతో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు రెండు వికెట్లకు ఇవే పరుగులు మాత్రమే చేసింది.
2013లో హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లకు 21 పరుగులు మాత్రమే చేసింది.
2025లో హైదరాబాద్ వెళ్తగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ నాలుగు వికెట్లకు 24 పరుగులు మాత్రమే చేసింది.
2013లో పూణే వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ నాలుగు వికెట్లకు 25 పరుగులు మాత్రమే చేసింది.
ఇక ప్రస్తుత సీజన్లో పవర్ ప్లే లో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్ చెత్త రికార్డు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్ కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది.
ఇక బెంగళూరులో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు మూడు వికెట్ల కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై రెండు వికెట్ల కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా ఈ సీజన్ లో పవర్ ప్లే లో అత్యంత చెత్త గణాంకాలను హైదరాబాద్ జట్టు నమోదు చేయడం విశేషం.
వాస్తవానికి 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును క్లాసెన్(71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు ఏకంగా 99 పరుగులు జత చేశారు. అందువల్లే హైదరాబాద్ సొంతమైదానంపై కాస్త గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లేకుంటే దారుణంగా ముంబై ముందు తలవంచాల్సి వచ్చేది.
Also Read: రక్తం ఉడికిపోతుంది.. ఇకపై ఊరుకునేది లేదు.. పహల్గాం ఉగ్రదాడిపై RCB మాజీ ఆటగాడు!