Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన ఆ సినిమాతో ఇండస్ట్రీలో సంచలనాలను క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కారణం ఏంటి అంటే ఆయన చేసే సినిమాలు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవడం వల్లే ఆయన వరుసగా పెద్ద సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు భయపడిపోయే స్థాయికి ఆయన పడిపోయారనే చెప్పాలి. సక్సెస్ లు లేని హరీష్ కర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Singh) సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.
Also Read : హరీష్ శంకర్ తో వెంకటేష్..మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి!
కానీ మొత్తానికైతే ఈ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడానికి ఆయన శాయా శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ‘జింఖానా’ (Jinkana) అనే సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హరీష్ శంకర్ హాజరయ్యాడు. ఈ సినిమాలో బాక్సింగ్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక దానికి సంబంధించిన ఈవెంట్ కి హాజరైన హరీష్ శంకర్ ను ఉద్దేశిస్తూ యాంకర్ మీరు బాక్సింగ్ కి సంబంధించిన సినిమాలు చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు అని అడగగానే హరీష్ శంకర్ దానికి సమాధానం ఇస్తూ నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో చేస్తాను అని చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్లుగా ముందుకు దూసుకెళుతున్న క్రమంలో హరీష్ శంకర్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితం అవుతున్నాడు.
మరి ఇక మీదట రాబోయే సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుందాం…అలాగే ఆయన బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు…మరి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : వెంకటేష్ తో సినిమా సెట్ చేసుకుంటున్న సీనియర్ డైరెక్టర్…