TV Serial Actress: బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని జంట ఏక్ నాథ్ – హారిక. ఏక్ నాథ్ టీవీ సీరియల్ హీరో గా ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఆయన హీరో గా నటించిన ప్రతీ సీరియల్ సూపర్ హిట్ గా నిల్చింది. ప్రస్తుతం ఆయన ఈటీవీ లో టెలికాస్ట్ అయ్యే ‘మనసంతా నువ్వే’ అనే సూపర్ హిట్ సీరియల్ లో నటిస్తున్నారు. ప్రతీ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ గత నాలుగేళ్ల నుండి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. దీంతో పాటు జీ తెలుగు లో ఆయన ‘లక్ష్మి నివాసం’ అనే సీరియల్ లో కూడా నటిస్తున్నారు. ఇక హారిక విషయానికి వస్తే, ఈమె టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా , విలన్ గా నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం ఈమె ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జానకి పరిణయం’ అనే సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఏక్ నాథ్ , హారిక బుల్లితెర పై పాపులారిటీ తెచ్చుకొని పెద్ద స్థాయికి వెళ్లి జీవితం లో బాగా స్థిరపడ్డారు. వీళ్లిద్దరు కలిసి కూడా కొన్ని సీరియల్స్ లో నటించారు. ‘నేను శైలజ’ అనే సీరియల్ ద్వారా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరు హైదరాబాద్ లో ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. నేడు ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వీడియో ని తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయగా , అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో వీళ్లిద్దరి జంట మధ్య ప్రేమాభిమానాలు చూసిన నెటిజెన్స్ ఎంతో మురిసిపోయారు.
జంట అంటే ఇలా ఉండాలి అంటే , సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు వీళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీవీ షోస్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు, వీళ్లిద్దరు సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ కి కూడా సుపరిచితమే. ఇన్ స్టాగ్రామ్ లో ఈ జంట అప్లోడ్ చేసే ఫోటోలకు , వీడియోలకు రెస్పాన్స్ మామూలు రేంజ్ లో ఉండదు. నేడు వీళ్ళు అప్లోడ్ చేసిన గృహ ప్రవేశం వీడియో కి అతి తక్కువ సమయం లోనే వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
