‘Bhairavam’ first week collections : ఇటీవల కాలం లో ఒక మీడియం రేంజ్ కి మంచి హైప్ క్రియేట్ అవ్వడం వంటివి ‘భైరవం'(Bhairavam Movie) విషయం లోనే జరిగింది. ఎందుకంటే ముగ్గురు హీరోలు, సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనే టాక్ వచ్చినప్పుడే ఈ చిత్రం లో ఎదో విశేషం ఉందని అంతా అనుకున్నారు. పాటలు, ట్రైలర్ వగైరా వంటివి బాగా క్లిక్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక మూవీ టీం కూడా ప్రొమోషన్స్ ఇరగకుమ్మేసారు. నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చి సినిమా పై హైప్ తీసుకొని రావడం లో తమ వంతు కృషి చేశారు. అలా మంచి పాజిటివ్ బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకు టాక్ కూడా బాగా కలిసొచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్.
విడుదలై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి అడుగుపెట్టడానికి ఇంకా ఎంత వసూళ్లు రాబట్టాలి అనేది ఇప్పుడు క్లుప్తంగా చూద్దాము. విడుదలకు ముందు ఈ సినిమాకు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్ తగ్గట్టు ఓపెనింగ్ రాలేదు, మరో పక్క లాంగ్ రన్ కూడా రావడం లేదు. మొదటి వారం తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం కేవలం 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 80 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 6 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే కనీసం 40 శాతం రికవరీ ని కూడా ఈ చిత్రం సొంతం చేసుకోలేదు అన్నమాట.
Also Read : మొదటిరోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన ‘భైరవం’..ఓవరాల్ గా ఎంతొచ్చిందంటే!
అసలే థియేటర్స్ లో సరైన సినిమాలు లేవు. రాకరాక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా. మంచి వసూళ్లతో థియేటర్స్ నిండిపోతాయని అనుకుంటే కమర్షియల్ గా మరో డిజాస్టర్ వైపు ఈ చిత్రం అడుగులు వేయడం ట్రేడ్ కి మింగుడు పడని విషయం. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చినట్టు అక్కడి ట్రేడ్ పండితులు. మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) మరియు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) లకు ఓవర్సీస్ లో ఎలాంటి మార్కెట్ లేకపోవడం వల్ల ఈ సినిమా చాలా తక్కువ రేట్ కి అమ్ముడుపోయింది. అందుకే కేవలం మొదటి వీకెండ్ లోనే 200 శాతం లాభాలతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిల్చిందట. రెండు ప్రాంతాల్లో విభిన్నమైన ఫలితాలు అంటే ఆలోచించి దగ్గ విషయమే. తెలుగులో కూడా తక్కువ రేట్ కి బిజినెస్ చేసి ఉండుంటే బ్రేక్ ఈవెన్ అయ్యేదట.