Hari Hara Veeramallu Advance Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రం మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని జానర్ ని మొట్టమొదటిసారి చేసాడు. ఇలాంటి గెటప్ లో ఆయన కనిపిస్తాడని అభిమానులు బహుశా కలలో కూడా చూసి ఉండరు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు, మొదటి గ్లింప్స్ వీడియో విడుదల చేసినప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ సరికొత్త గెటప్ లో అదిరిపోయాడు కాబట్టి. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే బాగుండేది. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఎంత ఆలస్యం అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ ఆలస్యం కారణం గా కాస్త హైప్ తగ్గిన విషయం వాస్తవమే.
కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే విడుదల దగ్గర పడే కొద్దీ హైప్ సాధారణంగానే పెరిగిపోతూ వెళ్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి పవన్ మేనియా నే మొత్తం కనిపిస్తాది. ఆ వేవ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ఉంది. కానీ కంటెంట్ పరంగా వేరే లెవెల్ ఉంది, కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి చూడాలి అనే ఆత్రుత మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఎంత వసూళ్లు వచ్చినా పవన్ కళ్యాణ్ మేనియా కారణంగానే రావాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నేడు మొదలు అయ్యాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా లో మొదటి చార్ట్ ని విడుదల చేశారు. ఈ చార్ట్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే మొదలు అయ్యాయి. రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించిన దానికంటే భీబత్సం గా ఉంది. బుకింగ్స్ ప్రారంభించిన కాసేపటికే 3 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట.
Also Read: Akiranandan in OG Movie : ఓజీ సినిమాలో కనిపించనున్న అకీరానందన్… సైలెంట్ గా వారసుడి ఎంట్రీ…
అంటే దాదాపుగా 70 వేల డాలర్లు అన్నమాట. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా ఇదే రేంజ్ ట్రెండ్ తో మొదలై ఫైనల్ గా 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఇదే జోరుని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ‘దేవర’ ప్రీమియర్ షోస్ గ్రాస్ ని దాటుతుందని చెప్తున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. ఈ నెలాఖరున విడుదల అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ బాగుంటే కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికా లో ఆల్ టైం రికార్డు ప్రీమియర్స్ ని నమోదు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలం నుండి ఆకలితో ఉన్నారు, అంతే కాకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ చేంజర్’ మినహా టాలీవుడ్ లో మరో స్టార్ హీరో సినిమా విడుదల అవ్వలేదు. చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ‘హరి హర వీరమల్లు’ కి ఉపయోగపడేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.