MG Windsor : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారతీయ మార్కెట్లో విండ్‌సర్ ఈవీ ప్రో డెలివరీలను షురూ చేసింది. ఇటీవల విడుదలైన ఈ ఈవీ కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఇది విండ్‌సర్ శ్రేణిలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్, స్టాండర్డ్ విండ్‌సర్ ఈవీ కంటే అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఎంజీ విండ్‌సర్ ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ.18.10 లక్షలు. ప్రారంభంలో దీనిని రూ.17.49 లక్షల ఎక్స్-షోరూమ్‌లో విడుదల చేశారు. కానీ ఇది మొదటి 8,000 మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకారం విండ్‌సర్ ప్రో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కంపెనీ విండ్‌సర్ ప్రో ఎలక్ట్రిక్ మోటర్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది ముందు యాక్సిల్‌పైనే అమర్చబడి, 134 bhp పవర్, 200 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ విండ్‌సర్ ప్రో ఈవీలో 52.9 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. విండ్‌సర్ ఈవీలో 38 kWh యూనిట్ ఉంది.
Also Read : పెట్టుబడి అవసరం లేకుండా, నష్టం రాకుండా ఉండే అదిరిపోయే బిజినెస్ ఐడియా ఇదే…
విండ్‌సర్ ఈవీ ప్రోలో కొత్త కలర్ ఆప్షన్లు
విండ్‌సర్ ఈవీ ప్రోలో వినియోగదారులకు 3 కొత్త కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అవి సెలడాన్ బ్లూ, ఆరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్. వీటితో పాటు పెర్ల్ వైట్, స్టార్‌బర్స్ట్ బ్లాక్, ఫిరోజా గ్రీన్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, హెక్టర్ లాంటి 19-ఇంచుల అల్లాయ్ వీల్స్ కూడా అందించారు. ప్రారంభంలో ఈ అల్లాయ్ వీల్స్ వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
విండ్‌సర్ ఈవీ ప్రోలో లభించే ఫీచర్లు
ఎంజీ విండ్‌సర్ ఈవీతో పోలిస్తే ప్రో ట్రిమ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ADAS లెవెల్ 2తో వస్తుంది. దీనితో పాటు ఇంటీరియర్‌ను ఇప్పుడు బేజ్, బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్‌లో తయారు చేశారు. ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.