https://oktelugu.com/

Rashmika : అల్లు అర్జున్ తో డ్యాన్స్ చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ హీరోయిన్ రష్మిక మందన షాకింగ్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్..డ్యాన్స్ అంటేనే అల్లు అర్జున్..ఇండియా లో ది బెస్ట్ డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే అల్లు అర్జున్ టాప్ 2 లో ఉంటాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 08:36 AM IST

    Rashmika

    Follow us on

    Rashmika : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్..డ్యాన్స్ అంటేనే అల్లు అర్జున్..ఇండియా లో ది బెస్ట్ డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే అల్లు అర్జున్ టాప్ 2 లో ఉంటాడు. ఆ స్థాయి డ్యాన్సర్ ఆయన. మన టాలీవుడ్ కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లేని రోజుల్లోనే అల్లు అర్జున్ తన డ్యాన్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో తనకి పాపులారిటీ ని దక్కించుకున్నాడు. ఇలాంటి అదృష్టం చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. టాలెంట్ కి తోడు అదృష్టం తోడైతే దానికి పర్యాయపదం లాగా నిలిచే హీరో అల్లు అర్జున్. అయితే ఈమధ్య కాలం లో అల్లు అర్జున్ ఊర మాస్ స్టెప్పులేసి చాలా కాలం అయ్యింది. కానీ పుష్ప 2 చిత్రం లో తన మార్క్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టడం తో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ‘పీలింగ్స్’ సాంగ్ లో ఆయన రష్మిక తో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులను చొక్కాలు చింపుకొని స్క్రీన్స్ ముందు ఎగిరేలా చేసింది.

    ఈ పాట షూటింగ్ సమయంలో తనకి ఎదురైనా అనుభవాల గురించి హీరోయిన్ రష్మిక చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ సినిమా విడుదలకు దగ్గరలో ఉన్నప్పుడు ఈ సాంగ్ షూటింగ్ చేసాము. ఈ పాట ని పూర్తి చేయడానికి మాకు 5 రోజుల సమయం పట్టింది. అల్లు అర్జున్ లాంటి టాప్ డ్యాన్సర్ తో ఊర మాస్ సాంగ్ చేయడం నా అదృష్టం గా భావించాను. కానీ ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభంలో కాస్త భయానికి గురై, ఇబ్బంది ఫీల్ అయ్యాను. సాధారణంగా నన్ను చిన్నప్పటి నుండి ఎవరైనా పైకి ఎత్తుకుంటే చాలా భయపడిపోయే దానిని. అలా అల్లు అర్జున్ సార్ నన్ను ఎత్తుకొని డ్యాన్స్ చేసేలోపు మొదట్లో చాలా భయపడ్డాను. ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అలవాటు చేసుకొని నార్మల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చిని రష్మిక.

    థియేటర్స్ లో ఒక ఊపు ఊపుతున్న ఈ సాంగ్ ని రీసెంట్ గానే యూట్యూబ్ లో విడుదల చేసారు. వారం రోజుల క్రితం విడుదలైన ఈ పాటకు 89 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ పాటకు సంబంధించిన బిట్స్ ని అప్లోడ్ చేస్తున్నారు నెటిజెన్స్. సాధారణంగా ఇలాంటి పాటలకు మన టాలీవుడ్ నుండి మంచి రెస్పాన్స్ రావడం సహజమే. కానీ బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ పాటని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారంటే, అక్కడి ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 1600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 2000 వేల కోట్ల రూపాయిల మార్కుని అతి త్వరలోనే అందుకోబోతుంది.