Nidhi Agarwal : నిన్న సాయంత్రం ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. వైసీపీ పార్టీ నేత , మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ(MLC) దువ్వాడ శ్రీనివాస్(Duvvada srinivas) , ఆయన సతీమణి మాధురి స్థాపించిన ‘వాకులా సిల్క్స్'(Vakula Silks) షోరూమ్ ని నిన్న ప్రముఖ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించింది. నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో కలిసి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే9న విడుదల కాబోతుంది. ఇప్పటి నుండే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆమె చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ కి చెందిన వ్యక్తి కి సంబంధించిన షో రూమ్ ఓపెనింగ్ కి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు నిధి అగర్వాల్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
Also Read : దువ్వాడ మాధురి.. ఇంటర్వ్యూల్లో అసలు తగ్గేదేలేదుగా
గతంలో దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసాడు. గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాలుగైదు ప్రాంతాలలో దువ్వాడ పై కేసులు కూడా వేసి ఉన్నారు. కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోయే ప్రముఖల లిస్ట్ లో కొడాలి నాని తో పాటు దువ్వాడ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి హీట్ వాతావరణం లో ఉన్న సమయంలో నిధి అగర్వాల్ అక్కడికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వాకులా సిల్క్స్ మొట్టమొదటి స్టోర్ ని నా చేతుల మీదుగా లాంచ్ చేయించడం ఎంతో స్పెషల్ గా భావిస్తున్నాను. మీరు భవిష్యత్తులో వేల బ్రాంచులను ప్రారంభించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
అయితే ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం తో నిధి అగర్వాల్ అక్కడికి వెళ్లలేదనే నిజాన్ని గమనించాలి. దువ్వాడ శ్రీనివాస్ ఏ పార్టీ అనే విషయం కూడా నిధి అగర్వాల్ కి తెలిసి ఉండదు. పవన్ కళ్యాణ్ కి దువ్వాడ ప్రత్యర్థి అవుతాడనే విషయం కూడా నిధి అగర్వాల్ కి తెలియదు. కేవలం ఒక సెలబ్రిటీ గా డబ్బులు ఇస్తే ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. ఇక్కడి వరకే చూడాలి అంటూ విశ్లేషకులు అంటున్న మాట. ఇకపోతే రీసెంట్ గానే నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో కలిసి చేసిన డ్యూయెట్ సాంగ్ ‘కొల్లగొట్టినాదిరో’ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పై నిధి అగర్వాల్ చాలా ఆశలే పెట్టుకుంది. చూడాలి మరి ఆమె కెరీర్ ని ఈ చిత్రం ఏమేరకు బూస్ట్ చేస్తుంది అనేది.
Also Read : రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్న అల్లు అర్జున్..పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లోకి ‘ఆర్య 2’
Niddhi Agerwal inaugurates Duvvada Srinivas And Madhuri’s Vakula Silks Showroom pic.twitter.com/Nzhf5M8Iwn
— Telugu360 (@Telugu360) March 15, 2025