NTR-Hrithik Roshan
NTR-Hrithik Roshan : ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న చిత్రం ‘వార్ 2 ‘(War 2 Movie). 2019 వ సంవత్సరం లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఒక పాట, క్లైమాక్స్ సన్నివేశం మాత్రమే బ్యాలన్స్ ఉంది. పాటకు సంబంధించిన రిహార్సల్స్ ని ఇటీవలే ప్రారంభించారు. కానీ రిహార్సల్స్ లోనే హృతిక్ రోషన్ కాళ్లకు గాయాలు అవ్వడంతో షూటింగ్ కి వాయిదా పడింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు, వచ్చే వారం నుండి షూటింగ్ లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే షూటింగ్ వాయిదా పడింది కాబట్టి సినిమా విడుదల తేదీని కూడా వాయిదా వేస్తారేమో అని అనుకున్నారు అభిమానులు.
Also Read : హృతిక్ రోషన్ కంటే అందంగా ఉన్న అతడి డూప్.. వైరల్ అవుతున్న వీడియో
ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. కానీ ఆ తర్వాత వాయిదా పడింది అంటూ దేశవ్యాప్తంగా రూమర్స్ వ్యాప్తి చెందాయి. సెప్టెంబర్ లో, లేదా డిసెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు నేడు అడ్డుకట్ట పడింది. నేడు మేకర్స్ మరోసారి ఈ చిత్రం ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే OCD టైమ్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నిన్న ఒక వాట్సాప్ గ్రూప్ చాట్ ని లీక్ చేసింది. ఈ గ్రూప్ లో స్పై యూనివర్స్ కి సంబంధించిన వివరాలు మొత్తం ఉన్నాయి. పఠాన్, టైగర్, కబీర్, జిమ్ వంటి వారు చాట్ చేసుకుంటూ ఉంటారు. దీపికా పదుకొనే, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారు కూడా ఈ గ్రూప్ లో ఉన్నారు.
ఇలా అందరూ సరదాగా చాట్ చేసుకుంటున్న సమయంలో గ్రూప్ అడ్మిన్ పఠాన్ ‘X’ అనే వ్యక్తిని గ్రూప్ లో యాడ్ చేస్తాడు. ఆ X అనే వ్యక్తి మరెవ్వరో కాదు, జూనియర్ ఎన్టీఆర్. ఈయన గ్రూప్ లోకి రాగానే అందరిని తొలగిస్తూ వెళ్తాడు. చివరికి తనని గ్రూప్ లోకి తీసుకొచ్చిన పఠాన్ ని కూడా తొలగించేస్తాడు. చివరికి కబీర్ ఒక్కడే మిగులుతాడు. ‘హాయ్ కబీర్’ అని ఎన్టీఆర్ మెసేజ్ చేయగా. కబీర్ ‘అసలు ఎవరు నువ్వు..ఎందుకు ఇదంతా చేస్తున్నావ్’ అని అడుగుతాడు. అప్పుడు ఎన్టీఆర్ ‘ఇదే సమయం..నీతో కాస్త మాట్లాడాలి’ అని అంటాడు. ఆ తర్వాత వార్ 2 అని స్టైల్ గా పేరు పడుతుంది. ఈ ట్వీట్ కి యాష్ రాజ్ సంస్థ స్పందిస్తూ మేము కూడా ఈ రేంజ్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు, ఆగస్టు 14 న థియేటర్స్ లో ఇరువురి హీరోల నట విశ్వరూపం చూస్తారంటూ చెప్పుకొచ్చాడు.
Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 … there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… ⚠️‼️ https://t.co/eVmQRLLJtG
— Yash Raj Films (@yrf) March 16, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Producers leak ntr hrithik roshans whatsapp chat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com