Homeఎంటర్టైన్మెంట్Hari Hara VeeraMallu Contravercy : పవన్ కళ్యాణ్ అంటే ఆ నిర్మాతకు భయం లేదా?...

Hari Hara VeeraMallu Contravercy : పవన్ కళ్యాణ్ అంటే ఆ నిర్మాతకు భయం లేదా? మీడియా ముందుకు రాడే!

Hari Hara VeeraMallu Contravercy : హరి హర వీరమల్లు విడుదలకు ముందు ఎగ్జిబిటర్స్ థియేటర్స్ బంద్ కు పిలిపునిచ్చారన్న వార్తలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి వారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుందని అసహనం వ్యక్తం చేశాడు. ఈ బంద్ నిర్ణయం వెనుక ఆ నలుగురు బడా నిర్మాతలు ఉన్నారనే వాదన తెరపైకి వచ్చింది. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ తెలుగు రాష్ట్రాలలో గల మెజారిటీ థియేటర్స్ ని కలిగి ఉన్నారు. ఆ విధంగా చిత్రాల విడుదల, థియేటర్స్ కేటాయింపు వంటి కీలక విషయాల్లో గుప్తాధిపత్యం సాగిస్తున్నారు అనే ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రకటన నేపథ్యంలో అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ నలుగురిలో నేను ఒకడిని కాదని అన్నారు. తనకు చాలా తక్కువ థియేటర్స్ ఉన్నాయని వెల్లడించారు. అనంతరం దిల్ రాజు సీన్ లోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ ని బాధించామని, ఆయన మాకు పెద్దన్న, తిడితే పడతాము అన్నారు. థియేటర్స్ బంద్ నిర్ణయం గోదావరి జిల్లాలలో జరిగింది. నాకు ఎలాంటి ప్రమేయం లేదు అన్నారు. అల్లు అరవింద్ వలె నేను కూడా ఆ నలుగురిలో ఒకడిని కాదని దిల్ రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?

అయితే దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదు. తన మీద వస్తున్న పరోక్ష ఆరోపణలకు వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అంటే సురేష్ బాబుకు భయం లేదా అనే చర్చ మొదలైంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. దశాబ్దాల పాటు బడా చిత్రాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్, నిర్మాణంపై దృష్టి తగ్గించింది. స్మాల్, మీడియా బడ్జెట్ చిత్రాలు మాత్రమే తీస్తున్నారు. అది కూడా అరుదుగా. డిస్ట్రిబ్యూషన్ లో కూడా సురేష్ బాబు ఏమంత యాక్టీవ్ గా లేరని సమాచారం. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రకటనల మీద తనకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన భవిస్తూ ఉండవచ్చు.

ఏది ఏమైనా.. సురేష్ బాబు వ్యవహార శైలి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ టికెట్స్ ధరల నుండి, థియేటర్స్ నిర్వహణ, తినుబండారాల ధరలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలిపారు. అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు జూన్ 12న విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular