Hari Hara Veeramallu Producer : హీరోలను దైవంగా భావించే అభిమానుల వద్ద సదరు దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ప్రతీ నిర్ణయం లోనూ ఆచి తూచి అడుగులు వెయ్యాలి, అభిమానుల వద్ద ఏ చిన్న తేడా వచ్చినా లెక్కలు మారిపోతాయి, సోషల్ మీడియా ద్వారా సదరు దర్శక నిర్మాతలను బూతులు తిట్టేస్తారు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్ర నిర్మాత AM రత్నం అలాంటి పరిస్థితి నే ఎదురుకుంటున్నాడు. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అనే విషయం దాదాపుగా అందరికీ అర్థమైంది. కానీ ప్రొమోషన్స్ చాలా పేలవంగా ఉన్నాయి. సుమారుగా ఐదేళ్ల పాటు కష్టపడి నిర్మించిన చిత్రం, మా హీరో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎంతో శ్రద్ద పెట్టి ఇష్టం తో చేసిన సినిమాకి ఇంత నీచమైన ప్రొమోషన్స్ చేస్తావా అంటూ అభిమానులు ఆయన్ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి బూతులు తిట్టారు.
Also Read : సంతూర్ మమ్మీ గా బాగా ఫేమస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో తెలుసా..
ఇది రత్నం వరకు చేరడంతో ఆయన ఈ కామెంట్స్ ని చూసి చాలా బాధపడినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను, కళ్యాణ్ గారితో సినిమా తీస్తే అభిమానులు జీవితంత గుర్తించుకునేలా ఉండాలనే తపన తో ఎక్కడా తగ్గకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ చిత్రాన్ని పూర్తి చేసాను. అభిమానులు నాకు ఇలాంటి సమయంలో సపోర్టు గా ఉండాల్సింది పోయి, నన్నే తిడుతున్నారు అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకొని వాపోయాడట. అయితే ప్రొమోషన్స్ విషయం లో హరి హర వీరమల్లు టీం విఫలం అయ్యింది అనేది వాస్తవం. దాని వల్ల కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఈ సినిమా కేవలం మామూలు రేంజ్ అంచనాలకు పరిమితమైంది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొట్టమొదటి చిత్రమిది, ప్రతీ ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలని అభిమానులు కోరుకోవడం లో ఎలాంటి తప్పు లేదు.
కానీ నిర్మాత బాధ కూడా అర్థం చేసుకోవాలి. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి నష్టపోవాలని నిర్మాత కోరుకుంటాడా?, లేదు కదా?, వాళ్ళ శక్తి కి తగ్గట్టు ఎన్నెన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. నేడు ఈ చిత్రం నుండి ‘తార తార’ అనే ఐటెం సాంగ్ విడుదలైంది. చెన్నై లో ప్రముఖుల మధ్య ఈ పాటని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ ఈవెంట్ లో నిర్మాత AM రత్నం కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా ఖర్చు చేసాను, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది, కాస్త మీడియా మాకు ఈ సమయంలో సహకారం అందించాలి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది అభిమానులు అతని పరిస్థితి అర్థం చేసుకోండి, ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి అంటూ తిడుతున్న అభిమానులపై విరుచుకుపడ్డారు.
To some dear fans,
For a few, it may feel like just a tweet or a couple of tickets. But for AM Ratnam uncle, HariHaraVeeraMallu is a dream built on hundreds of crores and his deepest belief in Kalyan garu.
He could’ve made a simple film in 1–2 sets after resuming in Sep 2024,… pic.twitter.com/Vza2gi3Veg
— Sharat chandra (@Sharatsays2) May 28, 2025