Rakul Preet Comments On Kohli : మైదానంలో చిరుత పులిలాగా పరుగులు తీస్తాడు. వికెట్ల మధ్య సింగం లాగా రన్స్ తీస్తాడు. అందువల్లే అతడిని సమకాలీన క్రికెట్లో లెజెండ్ అని పిలుస్తుంటారు. దాదాపు 18 సంవత్సరాలవుతున్నప్పటికీ.. అతనితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బెంగళూరు ఇంకా కొనసాగిస్తోంది అంటే.. అతని మీద నమ్మకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు జట్టు ఆటగాడిగానే కాకుండా.. టీమ్ ఇండియా ప్లేయర్ గా కూడా విరాట్ కోహ్లీకి విపరీతమైన అభిమాన గణం ఉంది. అతడు ఏం చేసినా సరే మీడియాలో సంచలనం అవుతుంది. సోషల్ మీడియాలో పెను ప్రకంపనకు దారితీస్తుంది. అతడు కనిపిస్తే చాలు అభిమానులు రెచ్చిపోతారు. పూనకాలు వచ్చినట్టుగా తాండవం చేస్తుంటారు.. సామాజిక మాధ్యమాలలో విరాట్ కోహ్లీని అనుసరించేవారు మిలియన్లలో ఉంటారు. అందువల్లే సమకాలీన క్రికెట్ చరిత్రలో అత్యధికమైన ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ ఇటీవల ఒక బ్యూటీ ఫోటోకు తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. దీంతో అందరూ అవాక్కైపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే విషయం మొత్తం సంచలనం అయిపోయింది.
Also Read : ఇప్పటికే మూడుసార్లు ఫైనల్ కు.. ఈసారి బెంగళూరు కప్ కొడుతుందా?
బాలీవుడ్ లో అవనీత్ కౌర్ అనే నటి ఉంది. ఇటీవల ఆమె గోవాలో ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఒకదానికి విరాట్ కోహ్లీ తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. దీంతో అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఫలితంగా విరాట్ కోహ్లీ నేరుగా రెస్పాండ్ కావలసి వచ్చింది. తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఆల్గారిథం చోటుచేసుకున్న పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండొచ్చని.. దాని వెనుక ఎటువంటి ఉద్దేశం లేదని విరాట్ కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని.. ఊహగానులకు అవకాశం ఇవ్వదని.. తనను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
ఈ విషయం మీద ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.. “అవనీత్ కౌర్ అభిమానులు ఏర్పాటు చేసిన పేజీలో ఒక ఫోటోకు విరాట్ కోహ్లీ తన ఆసక్తిని వ్యక్తం చేయడంతో.. ఆమెకు ఏకంగా రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారు. వాస్తవంగా ఈ విషయం చాలా బాధ కలిగిస్తున్నది. నిజానికి మనకు ఎటువంటి పని పాట లేదు. ఎందుకంటే ఇదే విషయాన్ని ప్రముఖంగా చర్చిస్తున్నామంటే మనకు ఎటువంటి శ్రమ లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా వల్ల సమయాన్ని వృధా చేస్తున్నాం. కోహ్లీ ఒక సెలబ్రిటీ కాబట్టి.. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు ఇంతలా వైరల్ చేయడం వల్ల సమయం వృధాగాక మరేమిటి.. నా దృష్టిలో ఇది పూర్తిగా అనవసరమైన విషయం.. వాస్తవానికి సోషల్ మీడియాలో ఒక్కోసారి మన స్నేహితులను అన్ ఫాలో చేస్తుంటాం. అలాంటిది విరాట్ కోహ్లీ గురించి అంతగా పట్టించుకుంటున్నామంటే మనకు పెద్దగా పని లేదని అనుకోవాలి. ఇలాంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని” రకుల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎక్కడి దాకా వెళ్తాయో చూడాల్సి ఉంది.