Homeఎంటర్టైన్మెంట్Jyothi Roy Tattoo: ప్రైవేట్ పార్ట్ పై బ్యూటిఫుల్ టాటూ... ఇబ్బందిపడుతూనే ఎంజాయ్ చేసిన గుప్పెడంత...

Jyothi Roy Tattoo: ప్రైవేట్ పార్ట్ పై బ్యూటిఫుల్ టాటూ… ఇబ్బందిపడుతూనే ఎంజాయ్ చేసిన గుప్పెడంత మనసు జగతి!

Jyothi Roy Tattoo: స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. ఇది అత్యంత ప్రజాదరణ కలిగిన సీరియల్. రిషి-వసు పాత్రలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ నటులు ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. మొదట జగతి, తర్వాత రిషి కూడా సీరియల్ నుంచి తప్పుకున్నారు. అదలా ఉంటే… జగతి పాత్ర చేసిన కన్నడ నటి జ్యోతి రాయ్ గురించి జనాలకు తెలిసింది తక్కువే. హీరో తల్లిగా హోమ్లీ రోల్ చేసిన జ్యోతి రాయ్ ని చూస్తే ఎవరైనా వయసులో పెద్దావిడ అనుకుంటారు. నిజానికి జ్యోతి రాయ్ ఏజ్ జస్ట్ 30 అట. ఇటీవల ఆ విషయం రివీల్ చేసింది.

తన పాన్ కార్డు పై ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తూ అసలు వయసు బయటపెట్టింది. గుప్పెడంత మనసు లో పద్ధతి గల పాత్ర చేసిన జగతి సోషల్ మీడియా పోస్ట్స్ మాత్రం కాకరేపుతున్నాయి. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అమ్మడు బికినీలో దర్శనమిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. జ్యోతి రాయ్ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది.

గుప్పెడంత మనసు లో జగపతి పాత్రను చంపేశారు. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్ అనే రెండు వెబ్ సిరీస్లు చేస్తుంది. ఈ సిరీస్లలో జ్యోతి రాయ్ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందట. వైలెన్స్ తో పాటు బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించినట్లు సమాచారం. ఇటీవల ప్రెట్టీ గర్ల్ నుండి ఫస్ట్ లుక్ షేర్ చేయగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. జ్యోతి రాయ్ నటించిన సదరు ప్రాజెక్ట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా జ్యోతి రాయ్ తన ఎదపై టాటూ వేయించుకుంది. హోప్ అనే పదంతో పాటు సీతాకోక చిలుకను టాటూ గా వేయించుకుంది. మరి టాటూ వేయించుకోవడం అంటే నొప్పితో కూడిన వ్యవహారం. తన ఇబ్బందిని తెలియజేస్తూ టాటూ వేయించుకున్నప్పుడు తీసిన వీడియో షేర్ చేసింది. బాధ అనుభవించినా… పూర్తి అయ్యాక సంతోషం వ్యక్తం చేసింది. కాగా 20 ఏళ్ల వయసులో జ్యోతి రాయ్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కొడుకు కూడా ఉన్నాడు. అతనితో విడిపోయిన జ్యోతి రాయ్ దర్శకుడు సురేష్ కుమార్ తో రిలేషన్ లో ఉంది.

RELATED ARTICLES

Most Popular