Samantha : ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత, రీసెంట్ గానే మళ్ళీ వరుస షూటింగ్స్ తో బిజీ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం ఆమె నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించబోతుంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని స్థాపించిన సమంత(Samantha Ruth Prabhu), శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. కొత్త నటీనటులను పెట్టి తీసిన ఈ సినిమాలో సమంత కూడా ఒక కీలక పాత్ర పోషించింది. మే9 న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే సమంత సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నా సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అభిమానులతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అలా ఆమె గత ఏడాది ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే సెషన్ ని అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం పెట్టింది. ఈ సెషన్ లో అభిమానులు ఆమెని అనేక ప్రశ్నలు అడిగారు. అందులో ఒక అభిమాని ‘ప్రేమికులు టాటూలు వేయించుకోవడం పై మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడగగా దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నా అభిమానులకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేమించుకుంటే ప్రేమించుకోండి పర్లేదు కానీ, టాటూ మాత్రం వేయించుకోవద్దు, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పుకొచ్చింది. సమంత నడుముపై నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) టాటూ ఉండే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ టాటూ అలాగే ఉండిపోయింది. దానిని తొలగించడం అంత తేలికైన విషయం కాదు. ఇకపోతే సమంత కూడా త్వరలోనే రెండవ పెళ్ళికి సిద్ధం అవ్వబోతున్న సంగతి తెలిసిందే.
తనతో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వచ్చిన రాజ్ నిడిమోరు తో సమంత కొంతకాలం నుండి ప్రేమాయణం నడుపుతూ, డేటింగ్ చేస్తుంది. రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కూడా. వీళ్లిద్దరి ఇంటి పెద్దలు కూడా పెళ్ళికి అంగీకారం తెలిపారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సమంత నుండే వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సమంత తన కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో ఉంది. కేవలం హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె చేయబోతుందట. ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ప్రకటించింది. అదే విధంగా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ తెరకెక్కబోయే సినిమాలో కూడా సమంత నటించే అవకాశాలు ఉన్నాయట.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత