Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Daughter: మోసగాళ్ల వలలో సితార... రంగంలోకి దిగిన మహేష్ బాబు!

Mahesh Babu Daughter: మోసగాళ్ల వలలో సితార… రంగంలోకి దిగిన మహేష్ బాబు!

Mahesh Babu Daughter: మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సమస్యల్లో చిక్కుకుంది. ఆమె ఇమేజ్ ని దెబ్బ తీసేలా మోసగాళ్లు రెచ్చిపోయారు. దాంతో మహేష్ బాబు, పోలీసులు రంగంలోకి దిగారు. విషయంలోకి వెళితే… సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పసిప్రాయంలోనే సితార యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. సదరు ఛానల్ లో సోషల్ మెసేజ్ తో కూడిన వీడియోలు, అలాగే పిల్లలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేది. అలాగే సితార 2019 నుండి ఇంస్టాగ్రామ్ అకౌంట్ వాడుతుంది.

ఇంస్టాగ్రామ్ లో సితారను 1.8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. సితారను అనుసరించే వాళ్ళ లిస్ట్ లో సెలెబ్స్ కూడా ఉన్నారు. సితార డాన్స్ వీడియోలు, వెకేషన్ ఫోటోలు, ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సితార పేరుతో మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రణాళిక వేశారు. సితార ఫోటో వాడుకుని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లింక్స్ ఇతర అకౌంట్స్ కి పంపుతున్నారు.

ఈ విషయం మహేష్ కుటుంబం దృష్టికి వచ్చింది. వెంటనే చర్యలకు ఉపక్రమించారు. మహేష్ బాబు టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులు, మహేష్ టీమ్ నేరగాళ్ళను పట్టుకునే పనిలో ఉన్నారు. నమ్రత శిరోద్కర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అందరినీ అలర్ట్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయవద్దని ఆమె హెచ్చరించారు.

సెలబ్రిటీల పేరున వచ్చే లింక్స్, మెసేజెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. మహేష్ కూతురు పేరిట మోసాలు జరగడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని మహేష్ బాబు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాకు సిద్ధం అవుతున్నారు. ఆ చిత్రంలోని పాత్ర కోసం మేకోవర్ సాధించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

RELATED ARTICLES

Most Popular