Guntur Kaaram Collections: కుప్పకూలిపోయిన ‘గుంటూరు కారం’ 2వ రోజు వసూళ్లు..ఏకంగా 600 షోలు రద్దు!

మొదటి షో నుండే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

Written By: NARESH, Updated On : January 14, 2024 11:46 am

Guntur Kaaram Collections

Follow us on

Guntur Kaaram Collections: గుంటూరు కారం టీమ్ కి ఊహించని దెబ్బ తగిలింది. నెగిటివ్ టాక్ తో రెండో రోజే మూవీ చతికల పడింది. 2024 సంక్రాంతి మహేష్ బాబుదే అనుకున్నారు అందరు. కారణం పెద్దగా పోటీ లేదు. మహేష్ బాబు స్థాయి స్టార్ డమ్ ఉన్న హీరో ఒక్కరు కూడా బరిలో లేరు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా… సినిమాలో మేటర్ లేకపోతే జనాలు చూడరని తేలిపోయింది. గుంటూరు కారం మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓపెనింగ్స్ వచ్చాయి.

అయితే మొదటి షో నుండే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రెండో రోజు మాత్రం గుంటూరు కారం చిత్ర వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. ఏకంగా 600 షోలు రద్దు అయినట్లు సమాచారం. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అని తెలుస్తుంది. పండగ దినాలు కావడంతో ఎంతో కొంత వసూళ్లు అయితే వస్తాయి.

అయితే మూవీ ఆశించిన విజయం సాధించడం కష్టమే. మహేష్ బాబు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇస్తాడు అనుకుంటే అది కుదర్లేదు. ఈ చిత్ర ఫలితానికి పూర్తిగా త్రివిక్రమ్ బాధ్యుడు. ఎలాంటి శ్రద్ద పెట్టకుండా నచ్చినట్లు మూవీ చేశాడు. కనీసం ఆరు నెలలు కూడా సరిగా షూటింగ్ జరగలేదు. ఒకసారి మూవీ సెట్స్ పైకి వెళ్ళాక స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయి. హీరోయిన్ పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.

ఎలా తీసినా చూస్తారులే అన్నట్లు గుంటూరు కారం తెరకెక్కింది. మహేష్ బాబు ప్రెజెన్స్ తప్పితే సినిమాలో విషయం లేదు. కేవలం మహేష్ స్టార్ డమ్ వలన ఆ మాత్రం వసూళ్లు దక్కుతున్నాయి. గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించాడు.