Guntur Kaaram Collections: గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్… బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిన మహేష్!

ఏపీ/ తెలంగాణా రాష్ట్రాల్లో గుంటూరు కారం రూ. 38.88 కోట్లు, రూ.52.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక అండ్ రెస్టాప్ ఇండియాలో రూ. 2.55 కోట్లు, ఓవర్సీస్ రూ. 10.60 కోట్లు రాబట్టింది.

Written By: NARESH, Updated On : January 13, 2024 2:27 pm

Sankranti 2024 Movies

Follow us on

Guntur Kaaram Collections: గుంటూరు కారం మూవీతో వసూళ్లు దంచి కొట్టాడు మహేష్ బాబు. తన స్టామినా ఏమిటో నిరూపించాడు. సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్ బాబు గుంటూరు కారంతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఫస్ట్ డే వసూళ్లు అంచనాలకు మించి ఉన్నాయి. గుంటూరు కారం నైజాం లో ఫస్ట్ డే రూ. 16.45 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ లో రూ. 3.31 కోట్లు, ఉత్తరాంధ్ర లో రూ. 4. 05 కోట్లు, ఈస్ట్ రూ. 4.01 కోట్లు, వెస్ట్ రూ.2.60 కోట్లు రాబట్టింది.

ఏపీ/ తెలంగాణా రాష్ట్రాల్లో గుంటూరు కారం రూ. 38.88 కోట్లు, రూ.52.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక అండ్ రెస్టాప్ ఇండియాలో రూ. 2.55 కోట్లు, ఓవర్సీస్ రూ. 10.60 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 52.03 కోట్ల షేర్ రూ. 79.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటిరోజే 40% రికవరీ చేసింది. గుంటూరు కారం మూవీ వరల్డ్ వైడ్ రూ. 132 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.

మరో రూ. 81 కోట్ల వసూళ్లు రాబడితే మూవీ లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. గుంటూరు కారం మూవీకి పండగ సెలవులు కలిసి రానున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. జనవరి 16 వరకు పండగ దినాలు. వసూళ్లు నిలకడగా ఉంటే ఈ టార్గెట్ చిన్నదే అని చెప్పాలి.

గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. మహేష్ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. గుంటూరు కారం చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. రమ్యకృష్ణ మహేష్ బాబు మదర్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరామ్ కీలక రోల్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది.