Hardik Pandya : ప్రస్తుతం ఇండియన్ టీమ్ తన దైన రీతిలో వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇండియన్ టీమ్ ఆఫ్గాన్ తో ఆడుతున్న మూడు టి మ్యాచ్ ల్లో భాగంగా మొదటి మ్యాచ్ లో విజయం సాధించి 1-0 తో ఇండియన్ టీమ్ ప్రస్తుతం ముందంజలో ఉంది. అయితే ఆఫ్గనిస్తాన్ టీం ని ఎదురుకోవడంలో మన యంగ్ ప్లేయర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించి ఇండియన్ టీమ్ ని విజయ తీరాలకు చేర్చారు. అయితే మన టీంలో ఉన్న యంగ్ ప్లేయర్ అయిన శివం దూబే మాత్రం 40 బంతుల్లో 60 పరుగులు చేసి టీమ్ కి గొప్ప విజయాన్ని అందించాడు.అలాగే బౌలింగ్ కూడా చేసి ఒక వికెట్ ని కూడా తీసుకున్నాడు…
ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ టీమ్ 158 పరుగులు చేయగా, ఇండియన్ టీమ్ 17.3 ఓవర్ లోనే 159 పరుగులను చేసి విజయాన్ని సాధించింది. ఇక ఇదిలా ఉంటే శివం దూబె టచ్ లోకి రావడం అనేది ఇండియన్ టీం కి ఒక గొప్ప న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు బిసిసిఐ ఎన్ని ఎక్స్పరిమెంట్లు చేసినా కూడా అవన్నీ టి20 వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నవే కాబట్టి వాటికోసం యంగ్ ప్లేయర్లు కూడా చాలా తీవ్ర కృషిని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక శివం దూబే, టి20 వరల్డ్ కప్ లో ప్లేస్ సంపాదించుకోవడం ఖాయం అంటూ ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా లో చాలా రకాలుగా కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి శివం ధూబే ఒక్క మ్యాచ్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు అతన్ని టి20 వరల్డ్ కప్ లోకి తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తర్వాత మ్యాచ్ ల్లో కూడా తన సత్తాని చాటితే శివం దూబే హిట్టర్ గా టి20 మ్యాచ్ తన ప్లేసును సుస్థిరం చేసుకుంటాడు అలాగే తను బౌలింగ్ లో కూడా సత్తా చటుతాడు కాబట్టి ఇండియన్ టీమ్ లోకి ఆల్ రౌండర్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ హార్దిక్ పాండ్యా తోపాటు శివం దూబే ను కూడా ఒక బెస్ట్ ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దామని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాండ్యా ఎక్కువగా గాయాల బారినపడి టీమ్ కు దూరమవుతున్నాడు కాబట్టి పేస్ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేసే ఒక ప్లేయర్ కూడా ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ లో లేడు కాబట్టి ఆ ప్లేస్ లో దూబేను వాడుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…