https://oktelugu.com/

దిల్ రాజ్ ఫంక్షన్ కు నందమూరి హీరోలు ఎందుకు రాలేదు?

టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత.. వరుస హిట్లు కొట్టే నిర్మాత దిల్ రాజు. దాదాపు స్టార్ హీరోలు అందరితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజ్ డేట్స్ అడిగితే ఇవ్వని హీరో ఉండడు అంటే అతిశయోక్తి కాదు.. అలాంటి హిట్ ట్రాక్ ను టాలీవుడ్ లో నమోదు చేసి సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఎదిగాడు. దిల్ రాజ్ తన హాఫ్ సెంచరీ బర్త్ డే ను ఘనంగా నిన్న రాత్రి జరుపుకున్నారు. దిల్ రాజు కుమార్తె […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2020 / 11:56 AM IST
    Follow us on

    టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత.. వరుస హిట్లు కొట్టే నిర్మాత దిల్ రాజు. దాదాపు స్టార్ హీరోలు అందరితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజ్ డేట్స్ అడిగితే ఇవ్వని హీరో ఉండడు అంటే అతిశయోక్తి కాదు.. అలాంటి హిట్ ట్రాక్ ను టాలీవుడ్ లో నమోదు చేసి సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఎదిగాడు. దిల్ రాజ్ తన హాఫ్ సెంచరీ బర్త్ డే ను ఘనంగా నిన్న రాత్రి జరుపుకున్నారు. దిల్ రాజు కుమార్తె , భార్య దగ్గరుండి ఆయన 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

    Also Read: బిగ్ బాస్ చెక్ తో బంగారం కొన్న గంగవ్వ.. ఎంత ఇచ్చారో తెలుసా?

    ఈ వేడుకకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి ప్రతి అగ్ర హీరో, సినీ ప్రముఖుడు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్,  రాంచరణ్, విజయ్ దేవరకొండ, సహా ఫంక్షన్లకు పెద్దగా హాజరు కాని పవన్ కళ్యాణ్ కూడా రావడం విశేషంగా చెప్పవచ్చు.

    కానీ అందరూ వచ్చినా నందమూరి కుటుంబం నుంచి ఒక్క హీరో కూడా ఫంక్షన్ కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కారణాలు ఏవో తెలియదు కానీ బాలక్రిష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈ కార్యక్రమంలో కనిపించలేదు.

    Also Read: క్రేజ్ పీక్స్, రిజల్ట్ షాక్… అక్కడ నాని ‘వి’ఫలమే!

    ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. దానికి తోడు దిల్ రాజు తదుపరి చిత్రం కల్యాణ్ రామ్‌తో ఉంది. అయినప్పటికీ అతను ఫంక్షన్ కు రాలేదు.

    నందమూరి ఫ్యామిలీని దిల్ రాజ్ దూరం పెట్టడానికి కారణం ఏంటి? అసలు పిలిచాడా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో నందమూరి అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్