దేశంలో రోజురోజుకు రక్త హీనత సమస్యతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు. తగినంత ఎర్ర రక్తకణాల ఉత్పత్తి జరగకపోవడం, ఆరోగ్య సమస్యల వల్ల రక్తం పోవడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కావాల్సినంత ఐరన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా తీసుకున్నా రక్తహీనత సమస్య వేధిస్తుందంటే మొదట అందుకు కారణం తెలుసుకోవాలి.
Also Read: బాదం పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
రక్తంలో హిమో గ్లోబిన్ తగ్గితే కళ్లు తిరగడం, కాళ్లు తిమ్మిరి ఎక్కడం, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తరచూ మాంసం తినడం ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు. చికెన్, మటన్ ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ లభించడంతో హిమోగ్లోబిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మందులు వాడటం వల్ల కూడా రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది.
Also Read: ఎముకలు దృఢంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
రోజూ పండ్లను ఎక్కువగా తీసుకుంటే కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాపిల్స్, జామ, దానిమ్మ, పుచ్చకాయలు తీసుకోవడం ద్వారా రక్త హీనత సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉండే సీ ఫుడ్ ను తరచూ తీసుకోవడం ద్వారా కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. సోయా బీన్స్, చిక్కుడు, బీన్స్ లాంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
పురుషుల్లో 14 నుంచి 16 గ్రాములు, మహిళల్లో 12 నుంచి 14 గ్రాములు హిమోగ్లోబిన్ ఉంటే మంచిది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే నీరసం పెరిగి మన పనులు మనం చేసుకోవడంలో సైతం ఇబ్బందులు ఎదురవుతాయి. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రోటీన్లు, ఐరన్ ఉన్న ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.