https://oktelugu.com/

మారడోనా అంతిమ సంస్కారాలు ఆపండి: అర్జెంటినా కోర్టు

ఫుట్బాల్ దిగ్గజం మారడోనా అంతిమ సంస్కారాలను నిలుపుదల చేయాలని అర్జెంటీనా కోర్టు ఆదేశించింది. నవంబర్ 25న మారడోనా గుండెపోటుతో మరణించారు. అయితే మారడోనా తన తండ్రి కావచ్చేమో అను అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మగలి గిల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో కోర్టు స్పందిస్తూ మారడోనా డీఎన్ఏ నమూనాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆయనకు వివాహ బంధంలో పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా మరో ఆరుగురు పిల్లలతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 18, 2020 / 12:11 PM IST
    Follow us on

    ఫుట్బాల్ దిగ్గజం మారడోనా అంతిమ సంస్కారాలను నిలుపుదల చేయాలని అర్జెంటీనా కోర్టు ఆదేశించింది. నవంబర్ 25న మారడోనా గుండెపోటుతో మరణించారు. అయితే మారడోనా తన తండ్రి కావచ్చేమో అను అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మగలి గిల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో కోర్టు స్పందిస్తూ మారడోనా డీఎన్ఏ నమూనాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆయనకు వివాహ బంధంలో పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా మరో ఆరుగురు పిల్లలతో పిత్రుత్వ సంబంధం ఉందని మారడోనా అంగీకరించారు. కానీ మారడోనా అంగీకరించిన వారిలో గిల్ లేరు. దీంతో ఆమెకు జన్మనిచ్చిన తల్లి రెండేళ్ల కిందట ఆమె తండ్రి మారడోనా కావచ్చని చెప్పినట్లు గిల్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన మ్రుతదేహాన్ని భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.