https://oktelugu.com/

Mahesh Babu Shirt : మహేష్ బాబు ధరించిన ఈ ‘హీర్మేస్’ స్వెట్ షర్ట్ ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

మహేష్, వెంకటేష్ ఒకే టేబుల్ లో కూర్చుని పేకాట ఆడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By: , Updated On : November 7, 2023 / 07:58 PM IST
Follow us on

Mahesh Babu Shirt : మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. సినిమాకు రూ. 50 కోట్లకు పైగా తీసుకుంటారు. పలు బ్రాండ్స్ కి ఆయన ప్రచార కర్తగా ఉన్నారు. అలాగే పలు వ్యాపారాలు చేస్తున్నారు. మహేష్ సంపాదన ఏడాదికి వందల కోట్లలో ఉంటుంది. అంతటి సంపన్నుడైన నటుడు మహేష్ లైఫ్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాగా మహేష్ ధరించి స్వెట్ షర్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆరంజ్ కలర్ లో ఉన్న ఆ స్వెట్ షర్ట్ లో మహేష్ మరింత హ్యాండ్ సమ్ గా ఉన్నారు. వెంటనే నెటిజెన్స్ దాని వివరాల సేకరణలో పడ్డారు.

హీర్మేస్ బ్రాండ్ కి చెందిన ఆ స్వెట్ ధర అక్షరాలా రూ. 121330 అట. ఒక షర్ట్ ధర లక్ష రూపాయలు అంటే మాటలు కాదు. ఓ సాధారణ ఫ్యామిలీకి ఆ లక్షకు ఏడాదికి సరిపడా దుస్తులు వస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి మహేష్ ఈ స్వెట్ షర్ట్ ధరించి వెళ్లారు. వెంకటేష్, రామ్ చరణ్ వంటి టాప్ సెలబ్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. కాగా మహేష్-వెంకీ ఫోటోలు వైరల్ అయ్యాయి.

మహేష్, వెంకటేష్ ఒకే టేబుల్ లో కూర్చుని పేకాట ఆడటం ప్రాధాన్యత సంతరించుకుంది. టేబుల్ మధ్యలో లక్షల రూపాయలు ఉన్నాయి. నిజంగా డబ్బులు పెట్టి పేకాట ఆడారని నెటిజెన్స్ భావించారు. అలాగే వెంకీ-మహేష్ ఓ ఫోటోకి పోజిచ్చారు. సదరు ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన మహేష్… పెద్దోడు పక్కన ఉంటే మహా సరదాగా ఉంటుందని కామెంట్ చేశాడు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ కొట్టింది.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహేష్ గుంటూరు కారం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తాజాగా దమ్ మసాలా అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. పాట విశేషంగా ఆకట్టుకుంటుంది.