Posani – KCR : తెలంగాణలో మళ్లీ కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. మొదట ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు పోసాని.. తర్వాత తెలంగాణ ఎన్నికలపై తన మనోగతాన్ని బయటపెట్టారు. ఎవరు మళ్లీ సీఎం అయితే తెలంగాణ బాగుపడుతుందన్నది బయటపెట్టారు.
ముందుగా పురంధేశ్వరిని పోసాని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ‘అయ్యో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అంటూ పెద్ద నీతిమంతురాలు లాగా.. పుండింగి లాగా .. దేశం నాశనమైపోతోంది.. దేశం అల్లకల్లోలం అయిపోతోంది వీరిద్దరూ బయట ఉంటే’ అంటూ చీఫ్ జస్టిస్ కు పురంధేశ్వరి లేఖ రాశారంటూ పోసాని నిప్పులు చెరిగాడు.
‘జగన్ బయట ఉంటే ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని.. తాన మరిది చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడని.. నా మరిది సీఎం అయితే నాకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపిస్తాడని.. కేంద్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తాడని పురంధేశ్వరి ఈ స్కెచ్ గీశారని’ పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. పురంధేశ్వరి అసలు నైజాన్ని బయటపెట్టాడు.
ఇక ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ సీఎం కావాల్సిన అవసరం.. చరిత్రను పోసాని చాలా చక్కగా వివరించారు. ఒక బక్క పలుచని.. బొక్కలు తేలి.. 30 కిలోల కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో చేశాడని.. తిరిగాడని.. ఆమరణ దీక్ష కూడా చేశాడని.. కేసీఆర్ చచ్చిపోతే తెలంగాణ నిప్పుకణం అవుతుందనే తెలంగాణను కేంద్రం ఇచ్చిందని పోసాని తెలిపారు..
తెలంగాణలో మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా.. అపర మేధావి, హానేస్ట్ ఫెలో, విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి కేసిఆర్ అంటూ పోసాని స్పష్టం చేశారు.
తెలంగాణలో మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా
అపర మేధావి, హానేస్ట్ ఫెలో, విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి కేసిఆర్ – పోసాని కృష్ణ మురళి pic.twitter.com/ygfukhVQHD
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2023