Dasara : ‘దసరా’ సినిమాలోని బార్ కి సిల్క్ స్మిత ఫోటో పెట్టేందుకు వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా! 

Dasara : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘దసరా’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఓపెనింగ్స్ ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టేలా వచ్చాయి.ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఈ సినిమా కొంత మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని థియేట్రికల్ షేర్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఆ ప్రాంతం లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ […]

Written By: NARESH, Updated On : April 3, 2023 9:43 pm
Follow us on

Dasara : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘దసరా’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఓపెనింగ్స్ ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టేలా వచ్చాయి.ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఈ సినిమా కొంత మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని థియేట్రికల్ షేర్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

కేవలం నాలుగు రోజుల్లోనే ఆ ప్రాంతం లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.ఇక ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం నాలుగు రోజుల్లోనే 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.కాసేపు ఈ కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలోని కొన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.ముఖ్యంగా ఈ చిత్రం లో ఉన్న బార్ కి సిల్క్ స్మిత ఫోటో ఎందుకు పెట్టారు అనేది చాలా మందికి అర్థం కాలేదు.

ఈ విషయం గురించి ఆ చిత్ర బృందం లో పనిచేసిన ఒకరిని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడగగా ఆయన దానికి సమాధానం చెప్తూ ‘డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారి చిన్నతనం లో వాళ్ళ తాత గారు రోజూ బార్ కి వెళ్లి కళ్ళు తెచ్చేకునేవారట.ఆ బార్ లో డైరెక్టర్ గారు సిల్క్ స్మిత ఫోటో చూసి ఎంతో ఆకర్షితుడు అయ్యాడట.

అప్పటికే ఆమె ఎవరో కూడా ఆయనకీ తెలియదట, కానీ ఆమె రూపం ఆయనని ఎంతగానో ఆకట్టుకుందట.అందుకే ఈ సినిమాలో సింగరేణి ప్రాంతం లో ఉన్న ఒక బార్, ఆ బార్ కి సిల్క్ స్మిత ఫోటో అని ఫిక్స్ అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.విడుదలకి ముందు టాలీవుడ్ లో ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఉండగా ఎందుకు సిల్క్ స్మిత బొమ్మనే బార్ కి పెట్టారు అనే సందేహం ఉండేది.ఇప్పుడు ఆ సందేహం క్లియర్ అయ్యింది.

Tags