Tanuja: గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. అయితే ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి తనూజ , కళ్యాణ్ పడాల ముఖ్య కారణం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళ బంధం ఆడియన్స్ కి చాలా స్వచ్ఛమైనది గా అనిపించడం వల్లే, ఆడియన్స్ వాళ్ళిద్దరికీ అంతలా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ కోసమే ఈ షో ని చూడడం మొదలు పెట్టారు. కానీ వీళ్లిద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది , అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బిగ్ బాస్ షో పూర్తి అయ్యి 7 నెలలు అవుతోంది, మరో రెండు నెలల్లో ‘బిగ్ బాస్ 10’ కూడా మొదలు కాబోతుంది.
సాధారణంగా షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ కంటెస్టెంట్స్ ని మర్చిపోతుంటారు. ఎంత గొప్ప విన్నర్ అయినా సరే , కొన్నాళ్ళకు ఆడియన్స్ కి గుర్తుకు రారు. కానీ వీళ్ళిద్దరినీ మాత్రం మర్చిపోవడం లేదు. వీళ్ళ అభిమానులు సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ వీళ్ళని వదలడం లేదు. రీసెంట్ గా తనూజ తన ముద్దమందారం సీరియల్ టీం తో కలిసి కళ్యాణ్ పడాల ని ఇండస్ట్రీ లో ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారని, అందులో తనూజ ప్రియుడు పవన్ సాయి ముఖ్య పాత్ర పోషిసున్నారని , ఇలా ఎన్నో రకాల కథనాలు ప్రచారం అయ్యాయి. దీనిపై తనూజ నిన్న చాలా గట్టి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘కళ్యాణ్ పడాల ఒక పాటని రీసెంట్ గానే చేశాడు , అది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాము. అనేక సార్లు వాడిని అడిగాను కూడా, ఎప్పుడు ఈ పాటని విడుదల చేస్తావు?, ఇంకెన్ని రోజులు దాచిపెట్టుకుంటావు అని. అలాంటిది ముద్దమందారం టీం , పవన్ సాయి , నేను కలిసి కుట్రలు చేస్తున్నామని , ఆ పాటని విడుదల కానివ్వకుండా అడ్డుపడుతున్నామని సోషల్ మీడియా లో కొంతమంది వీడియోలు చేస్తున్నారు. మీకు పని పాట లేదా?, అసలు కుట్రలు ఎందుకు జరుగుతాయి?, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాము , కుట్రలు చేసేంత సమయం మాకు ఉందని అనుకుంటున్నారా?, రీసెంట్ గానే కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనూజ నన్ను ఒక సమస్య నుండి కాపాడింది అని చెప్పాడు కదా, ఆ సమస్య కి దగ్గరుండి , రాత్రి రెండు గంటల వరకు కళ్యాణ్ కి తోడుగా ఉంటూ, అతని సమస్య ని పరిష్కరించి , తిరిగి అతని ఇంటి వద్ద డ్రాప్ చేసిందే పవన్ సాయి. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది తనూజ. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.






