SS Rajamouli Early Career Struggle Story: నేడు పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ చూడనంత పీక్ రేంజ్ ని చూస్తున్న ఎంతో మంది టాప్ సెలబ్రిటీలకు , ఆ స్థానం ఊరికే రాలేదు. ఎన్నో అవమానాలను ఎదురుకున్న తర్వాత వచ్చింది. ప్రస్తుతం మన భారత దేశం లో రాజమౌళి(Ss Rajamouli) పేరుని మించిన బిగ్గెస్ట్ బ్రాండ్ మరొకటి ఉంటుందా చెప్పండి?, అలాంటి రాజమౌళి తో సినిమా చెయ్యాలని ఎవరికీ మాత్రం ఉండదు ?, కానీ కెరీర్ ప్రారంభం లో ఈయన కూడా పలు అవమానాలను ఎదురుకోవాల్సి వచ్చింది. రాజమౌళి ఏమి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చినవాడు కాదు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక పెద్ద రచయితా. ఆయన ప్రోత్సాహం తోనే రాజమౌళి కి దూర దర్శన్ ఛానల్ లో ‘శాంతి నివాసం’ సీరియల్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. కానీ అంతకు ముందు రాజమౌళి రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు.
Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే
తన శిష్యులను ప్రోత్సహించడం లో రాఘవేంద్ర రావు ఎప్పుడూ ముందు ఉంటాడు. తన దగ్గర పని చేస్తున్న రోజుల్లోనే రాజమౌళి లోని ప్రతిభ ని గుర్తించి తన సొంత నిర్మాణ సంస్థ లో ‘శాంతి నివాసం’ సీరియల్ ని తీసే అవకాశం ఇచ్చాడు. ఆ సీరియల్ నడుస్తున్న సమయం లోనే రాఘవేంద్ర రావు నిర్మాతగా రాజమౌళి ని ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం ద్వారా డైరెక్టర్ ని చేసాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే రాజమౌళి తో తానూ సినిమా, సీరియల్ నిర్మించే ముందు, ఆయన్ని ఒక టాప్ నిర్మాతగా వద్దకు పంపాడట రాఘవేంద్ర రావు. అది కూడా ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ కథ తోనే. గంటల తరబడి వెయిట్ చేయించి, ఆ తర్వాత లోపలకు పిలిచి కథ విన్న తర్వాత ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని చెప్పి పంపేసాడట.
ఈ సంఘటన కారణంగా రాజమౌళి చాలా ఫీల్ అయ్యాడట. ముందుగా ఈ సినిమాని రాజమౌళి ఉదయ్ కిరణ్, ప్రభాస్ వంటి హీరోలతో తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ ఈ స్టోరీ తో సినిమాని తెరకెక్కించడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయం లో రాఘవేంద్ర రావు , ముందు గా రాజమౌళి లోని దర్శకత్వ ప్రతిభ ఏ మాత్రం ఉందో ఒకసారి పరిశీలించడానికి ‘శాంతి నివాసం ‘ సీరియల్ నిర్మించాడు. అది అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది, ఇతను ఇండస్ట్రీ కి పనికొస్తాడు అని బలంగా నమ్మిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 కథని తానే స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చాడు . ఇక ఆ తర్వాత హిస్టరీ మన అందరికీ తెలిసిందే .