Samantha: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత(Samantha Ruth Prabhu) రెండవ పెళ్ళికి సంబంధించిన ఫొటోలే ఉన్నాయి. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న రోజు నుండి సమంత పై సోషల్ మీడియా లో వచ్చినన్నీ కథనాలు దేశం లో ఏ సెలబ్రిటీ మీద కూడా రాలేదు. ఇప్పుడు ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో పెళ్లాడడం పై కూడా ప్రతీ రోజు ఎదో ఒక కథనం వస్తూనే ఉంది. రీసెంట్ గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో 2025 జ్ఞాపకాలు అంటూ రాజ్ తో కలిసున్న ఫోటోలను అప్లోడ్ చేసింది. ఇప్పటి వరకు అభిమానులు ఎవ్వరూ చూడండి ఫొటోలివి. వీటిని చూసిన అభిమానులు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నారు, మా దిష్టి తీయించుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు క్రింద చూడొచ్చు.
ఇకపోతే వీళ్లిద్దరి పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో మొదలైన సంగతి తెలిసిందే. సమంత విలన్ గా నటించిన ఈ వెబ్ సిరీస్ కి రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఆమెతో ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ ని కూడా తెరకెక్కించాడు. ఇప్పుడు ఆమెతో ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇలా తన ప్రతీ ప్రాజెక్ట్ లో సమంత ని తీసుకున్నప్పుడే ఆడియన్స్ కి అనుమానం వచ్చింది. కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది అని. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ సమయం నుండే వీళ్ళ మధ్య స్నేహానికి మించిన బంధం ఏర్పడింది. ఆ తర్వాత సిటాడెల్ షూటింగ్ సమయం లో అది ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చింది. గత ఏడాది నుండి వీళ్ళు డేటింగ్ లోనే ఉంటూ వచ్చారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది . గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఓ బేబీ’ అనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం ఫ్యామిలీ కమ్ యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కబోతుంది అట.