Tanuja And Kalyan Padala: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ గడిచిన నాలుగు సీజన్స్ కంటే TRP రేటింగ్స్ పరంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం బంధాలు. కంటెస్టెంట్స్ మధ్య ఉన్న రిలేషన్స్ కి ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా భరణి, తనూజ తండ్రి కూతురు బాండింగ్, అదే విధంగా ఇమ్మానుయేల్, సంజన తల్లి కొడుకు బాండింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యింది. అదే విధంగా యూత్ ఆడియన్స్ కి మాత్రం తనూజ, కళ్యాణ్ బాండింగ్ బాగా కనెక్ట్ అయ్యింది. వీళ్లది స్నేహమో, ప్రేమో తెలియదు కానీ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో ఉండేవాళ్ళు. కానీ ఇద్దరు టాప్ 2 రేస్ లో ఉండడం వల్ల వీళ్లిద్దరి అభిమానులు సోషల్ మీడియా లో భద్ర శత్రువులు లాగా కొట్టుకునేవారు.
బయటకు వచ్చేసిన తర్వాత కూడా వీళ్లిద్దరి అభిమానులు ఇలాగే ఉన్నారు. లోపల మేము అంత మంచి స్నేహితులం లాగా ఉన్నాము, బయట ఏంటి ఇలా జరుగుతుంది అని వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు కూడా. తనూజ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న తన అభిమానులకు కళ్యాణ్ మొన్న జరిగిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ లో దయచేసి అలా చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసాడు, అదే విధంగా తనూజ కూడా నిన్న తన లైవ్ చాట్ లో రిక్వెస్ట్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘దయచేసి కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపండి. ఎందుకంటే ఇది వాడి కెరీర్, ఇప్పుడిప్పుడే మొదలు అవుతుంది, మొదలు అయ్యింది కూడా. కాబట్టి దయచేసి వద్దు, ఇది నా రిక్వెస్ట్’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా కళ్యాణ్ తో మీకు ఉన్న బాండింగ్ ఏమిటి అని అభిమానులు ఒక ప్రశ్న అడుగుతారు.
దానికి తనూజ సమాధానం చెప్తూ ‘కళ్యాణ్ తో నా బాండ్ ఏమిటి అని ఎన్ని సార్లు అడుగుతారు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని, అంతకు మించి ఏమి లేదు..ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తా’ అంటూ చెప్పుకొచ్చింది తనూజ. అదే విధంగా మీరు గ్రాండ్ ఫినాలే రోజున దాదాపుగా అందరితో ఫోటోలు తీసుకున్నారు, కానీ కళ్యాణ్ తో ఎందుకు తీసుకోలేదు అని తనూజ ని అడగ్గా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘వాడు ఆరోజు వెంటనే బజ్ ఎపిసోడ్ కి వెళ్ళిపోయాడు, అంతకు ముందు వాడి స్నేహితులతో ఉన్నాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను వెళ్ళలేదు. తీరిక సమయం చూసుకొని కచ్చితంగా కలిసి ఫోటో దిగుతాం. కళ్యాణ్ తోనే కాదు మా నాన్న, రీతూ, డిమోన్, ఇమ్ము అందరితో ఫోటోలు దిగుతాను’ అంటూ చెప్పుకొచ్చింది.
