Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి స్పెషల్. ఎంతటి దూరంలో ఉన్న ఈ పర్వదినం నాడు సొంత గ్రామాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి( Pongal) వస్తే గ్రామాల్లో ఆ సందడి వేరు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం సొంత గ్రామాలకు వెళ్తుంటారు. నెలల ముందే ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భాగ్యనగరంలో నివసిస్తుంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేసింది. సంక్రాంతి తిరుగు ప్రయాణాల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రూట్లు, షెడ్యూల్ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అందుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్లు కూడా ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ రైళ్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ.. వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకుంటున్నారు.
* ఆ రెండు మార్గాల్లో..
ప్రధానంగా కాకినాడ( Kakinada), సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వీటిలో రెండు రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ కాకినాడ మార్గంలో నడుస్తాయి. మిగిలిన రెండు రైళ్లు మాత్రం మచిలీపట్నం వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి. జనవరి 5 నుంచి 20 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సాధారణ రైళ్లకు తోడు ఈ ప్రత్యేక రైళ్లు సేవలందిస్తాయి.
* రిజర్వేషన్లు సైతం మొదలు..
రెగ్యులర్ రైళ్లకు( regular trains) సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దసరా తరువాత రిజర్వేషన్లు చాలామంది చేసుకున్నారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా హైదరాబాదులో నివాసం ఉంటారు. వారు ఏటా సంక్రాంతి సమయంలో సొంత గ్రామానికి వస్తుంటారు. కుటుంబాలతో రావాల్సిన వారు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే అదనపు రైలు సర్వీస్లను అందుబాటులోకి తేవడం… రిజర్వేషన్లు కూడా ప్రారంభం కావడంతో వేలాదిమంది ముందస్తుగా చేసుకుంటున్నారు. జనవరి 5 నుంచి ఈ సంక్రాంతి రద్దీ మొదలుకానుంది. అయితే తిరుగు ప్రయాణంలో భాగంగా కూడా ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మరోవైపు బస్సులకు సైతం విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ముందస్తు రేజర్వేషన్ కు ఆఫర్లు ఇచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ సైతం అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు సన్నహాలు చేస్తోంది.