Honda Hness CD350: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హోండా కంపెనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కంపెనీ తయారు చేసే కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా హోండా కంపెనీ తన నమ్మకాన్ని పెంచుకుంటున్నది. ఆటోమొబైల్ పరిశ్రమలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. హోండా కంపెనీ ద్విచక్ర వాహనాల విక్రయాలలో మాత్రం స్థిరత్వం కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఈ కంపెనీ తన అమ్ముల పొది నుంచి Honda H’ness CB 350 అనే మోడల్ ను తీసుకొచ్చింది.
ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా..
Honda H’ness CB 350 అనేది హోండా కంపెనీ గతంలో తయారుచేసిన నమూనానే. కాకపోతే ఇప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా దీనిని మార్చింది.. ఇది పూర్తిగా ప్రీమియం మిడ్ కెపాసిటీ మోడల్. రెట్రో క్రూయిజర్ గా దీనిని హోండా కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా దీంట్లో హోండా కంపెనీ సాంకేతికతను జోడించింది. సున్నితమైన పనితీరు, క్లాసిక్ స్టైలింగ్ ఈ మోడల్ బైక్ కు ఉన్న ప్రత్యేకతలు.
డిజైన్ లో ఆధునికత
Honda H’ness CB 350 లో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది హోండా కంపెనీ. ముఖ్యంగా డిజైన్ లో ఆధునికతను ప్రదర్శించింది. రౌండ్ ఎల్ఈడి హెడ్ లాంప్ లు ఏర్పాటు చేసింది. టియర్ డ్రాప్ ఆకారంలో ఇంధన ట్యాంకును రూపొందించింది. క్రోమ్ ఎగ్జాస్ట్ రూపంలో బాడీ పానెల్ ఉంది. ప్రీమియం పెయింట్ విషయంలో కూడా క్వాలిటీ కనిపిస్తోంది. అత్యంత సూక్ష్మమైన బ్యాడ్జిగ్ ను హోండా కంపెనీ ఈ మోడల్ కు ఉపయోగించింది. మెటల్ ఫినిష్డ్ భాగాలు కూడా ఈ మోడల్ కు సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. ప్రీమియం ద్విచక్ర వాహనాల విభాగంలో ఈ మోడల్ అద్భుతంగా ఉంటుందని హోండా కంపెనీ చెబుతోంది.
ఇవీ ఇంజన్ ప్రత్యేకతలు..
Honda H’ness CB 350 మోడల్ లో 350 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. మారుమూల రోడ్ల నుంచి మొదలు పెడితే హైవే ల వరకు ప్రతి మార్గంలోనూ ఈ వాహనాన్ని అత్యంత అనుభూతితో డ్రైవింగ్ చేయవచ్చని హోండా చెబుతోంది. మృదువైన 5 స్పీడ్ గేర్ బాక్స్ ప్రయాణ అనుభూతిని అద్భుతంగా ఉంచుతుందని హోండా కంపెనీ నిపుణులు చెబుతున్నారు. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్ మీటర్లు, డిజిటల్ డిస్ప్లే తో అనలాగ్ మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఎలర్ట్, కాల్ నోటిఫికేషన్, యు ఎస్ బి చార్జింగ్ సపోర్ట్, హోండా సెలెక్టబుల్ ట్రాక్ కంట్రోల్ వంటివి ఇందులో అనుసంధానం చేసినట్టు హోండా కంపెనీ చెబుతోంది.
ఇంటీరియర్ విషయంలో..
ఇంటీరియర్ విషయంలో కూడా హోండా కంపెనీ ఏమాత్రం రాజీపడలేదు. పైగా వెడల్పైన సీటు, రిలాక్సిడ్ హ్యాండిల్ బార్ పొజిషన్ లాంగ్ రైడ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, ట్విన్ రియల్ షాక్ అబ్జర్వర్ వంటివి ఈ మోడల్ లో ఉన్నాయని హోండా కంపెనీ చెబుతోంది. Honda H’ness CB 350 లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ డిస్క్ బ్రేక్ లు ఈ మోడల్ లో ప్రత్యేక ఆకర్షణ. ట్రాక్షన్ కంట్రోల్ వల్ల ఎటువంటి రోడ్డుపై నైనా సరే ఈ బైక్ దూసుకుపోతుంది.