Hero Nandu: చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ హీరో గా సరైన గుర్తింపు ని దక్కించుకోలేకపోయిన వారిలో ఒకరు నందు. ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఆయన హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈమధ్య కాలం లో వెబ్ సిరీస్ లలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా పలు టీవీ షోస్ కి ఆయన యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అందులో ఈటీవీ ఛానల్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ఢీ’ అనే డ్యాన్స్ రియాలిటీ షో కూడా ఉంది. ఈ షో కి నందు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతీ బుధ, గురువారాల్లో ఈ డ్యాన్స్ షో టెలికాస్ట్ కానుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన ‘సైక్ సిద్దార్థ్’ అనే చిత్రం చేసాడు. డిసెంబర్ 12 న విడుదల కావాల్సిన ఈ సినిమా, ‘అఖండ 2’ కారణంగా జనవరి 1 కి వాయిదా పడింది.
ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా యామిని భాస్కర్ నటించగా, వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నందు, తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను తల్చుకొని బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఈ సినీ ఇండస్ట్రీ పై ఎంతో ఇష్టం తో అడుగుపెట్టాను. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఇక్కడే జీవితం అని అనుకున్నాను. కానీ మాలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేను చెయ్యని తప్పుకి నన్ను బాద్యుడిని చేసారు కొంతమంది’.
‘దాని వల్ల నేను ఎంతో మానసిక వేదనకు గురయ్యాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ వార్తలను చూసి చాలా బాధపడ్డారు. నా భార్య గీతా మాధురి అయితే ఈ దేశం వదిలి వేరే దేశానికీ వెళ్లి హోటల్ లో పని చేసుకొని బ్రతుకుదాం అని చెప్పేది. ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తుంటాయి’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు నందు. ఇంతకు ముందుతో పోలిస్తే నందు కెరీర్ ఇప్పుడు మంచిగానే వెళ్తోంది. అంతే కాకుండా ఆయన నటించిన ‘సైక్ సిద్దార్థ్’ సినిమా పై కూడా ఒక మోస్తారుగా మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాతో నందు ఇంత కాలం ఎదురు చూసిన సక్సెస్ ఎదురు అవుతుందని ఆశిస్తున్నారు విశ్లేషకులు.