spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan two movies: పవన్ కళ్యాణ్ చేసిన ఆ రెండు సినిమాలు అతన్ని ప్రమాదంలో...

Pawan Kalyan two movies: పవన్ కళ్యాణ్ చేసిన ఆ రెండు సినిమాలు అతన్ని ప్రమాదంలో నెట్టేశాయిగా…

Pawan Kalyan two movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు పాన్ ఇండియా సినిమాలతో తెచ్చుకుని ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిపోతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిరాశపర్చడంతో ఆయన కొంతవరకు డీలాపడిపోయాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక రెండు సినిమాలు చేయడం వల్ల చాలా వరకు డిస్టబెన్స్ ని ఎదుర్కొన్నాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఖుషి సినిమా వరకు వరుస సక్సెస్ లను సాధిస్తూ చండించాడు. ఇక తన స్వీయ దర్శకత్వంలో ‘జానీ’ సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత అతనికి దాదాపు ఒక 10 ఏళ్ల పాటు సరైన సక్సెస్ రాలేదు. ఇక గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డమ్ ని అందుకున్నాడు.

ఆ తర్వాత చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా అతనికి ఏమాత్రం మార్కెట్ ను క్రియేట్ చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చేసిన జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు అతని ఇమేజ్ ను చాలా వరకు డౌన్ చేశాయని తద్వారా మార్కెట్ ని కొంతవరకు తగ్గించాయనే చెప్పాలి.

Also Read: నాకు పెళ్లి కాకపొయ్యుంటే ఆ హీరోతో కచ్చితంగా డేటింగ్ చేస్తా – యాంకర్ అనసూయ

ప్రస్తుతం ఆయన రాజకీయ నాయకుడిగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.
ముఖ్యంగా తన అభిమానులు తనని స్క్రీన్ మీద చూడడానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి తన సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ఆయన భారీ ఎత్తున ప్రణాళికలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అతనికి ఏ రకంగానూ యూజ్ కాలేదు. ఇక ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక దాంతో పాటుగా మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular